loader

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

తనను వేశ్యలా చూశారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ నియమించింది. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఉన్నారు. మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్ లో ఎవరెవరు ఉన్నారు. ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలను కమిటీ […]

ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్

్వార్ట్జ్‌ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. నెల్లూరు పోలీసుల సెర్చింగ్‌తో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. క్వార్ట్జ్‌ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆయన ముందస్తు బెయిల్‌  నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం.

కేసీఆర్‌తో కేటీఆర్ కీలక భేటీ…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేటీఆర్… ఆయనతో పలు అంశాలు చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్‌లో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆ తర్వాత ఆమె చేసిన కామెంట్స్‌పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

భారీ వర్షాలు.. రోడ్లలన్నీ జలమయం!

ఢిల్లీలోని భారీ వర్షాల వల్ల రోడ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీ, నోయిడా నుండి ఘజియాబాద్ వరకు బలమైన గాలులు వీచాయి. ఆదివారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం, గాలి వేగం గంటకు 60 కి.మీ. అది అత్యంత వేగంతో ఎగిరింది.

ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్…

భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం… తాజా మరో మెట్టు పైకి ఎక్కింది. జపాన్‌ను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతం భారత్ కన్నా అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.

ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం పునరుద్ధరణ, నిధులు విడుదల

గర్భిణీ స్త్రీల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్దరించింది,51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం… 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేశారు.

మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఆరోపణలపై విచారణ చేపట్టాలి: కేటీఆర్

తనను వేశ్యలా చూస్తున్నారంటూ మిల్లా మ్యాగీ చేసిన సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం అన్నారు. వాస్తవానికి తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని’ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇవాళ ఎన్డీఏ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మీటింగ్..

బిజెపి  నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్‌లో ఆదివారం ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. 20 రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సుపరిపాలన, అనుసరించాల్సిన అత్యుత్తమ పద్ధతులపై సమాలోచనలు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై ప్రధాని మోడీ, రక్షణ బలగాలను అభినందిస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు…

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రోజున కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని అల్పపీడన ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌కు తన సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో సొంతింటి కల సాకారమైంది. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద ఇంటి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్మాణం పూర్తవడంతో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామున జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి పాల్గొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON