loader

భారత్‌లో త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రావడం రావడంతోనే ఇండస్ట్రీని షేక్ చేయాలన్న సంకల్పంతో వస్తున్నారు. సుమారు రూ. 840 కంటే తక్కువ ధరకే అపరిమిత డేటా ప్లాన్‌లతో దండయాత్రకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  భారతదేశం తన బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక విధ్వంసకరమైన ఆరంభాన్ని ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.

కరోనా డేంజర్‌ బెల్స్‌తో మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో టెక్‌ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో కంపెనీలు ఉద్యోగులకు మరోసారి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇవ్వగా.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ిలికానీ వ్యాలీగా గుర్తింపు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. 20 రోజులుగా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని విధానంలో మార్పులు చేస్తున్నాయి.

ప్రపంచ సుందరి పోటీలపై మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మార్పు కోసం, యువతలో స్ఫూర్తి నింపేందుకు తాను హైదరాబాద్ వెళ్లానని, కానీ తనకు అక్కడ చేదు అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని, వినోదం కోసం తమను వీధుల్లో కోతుల తరహాలో నిర్వహకులు తిప్పారని, ఇది చాలా అసౌకర్యంగా అనిపించినట్లు పేర్కొంది.

సిస్టర్ స్ట్రోక్‌తో కెటిఆర్ చిన్న మెదడు చితికింది:మంత్రి సీతక్క

సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్ చిన్న మెదడు చితికి, అందుకే ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, కమీషన్ ముందుకు రావడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సిఎం రేవంత్.. ఈ సమావేశం తర్వాత ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్‌2కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపాలని సిఎం రేవంత్‌ రెడ్డి.. ప్రధానిని కోరినట్లు సమాచారం.

హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ సిటీలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం నుంచి వాన పడుతోంది. గచ్చిబౌలి, అమీర్ పేట్, లక్డీకపూల్‌, హయత్ నగర్, ఉప్పల్, హబ్సిగూడు, తార్నాక తదితర ప్రాంతాల్లో వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ముందుకు కదలలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభాస్‌కి జోడిగా బోల్డ్ బ్యూటీ త్రుప్తి డిమ్రి…

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో ‘స్పిరిట్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘స్పిరిట్’ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేని అనుకున్నారు. ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొనే తప్పుకుంది.. ఆమె ప్లేస్‌లో ‘యానిమల్’ ఫేమ్ త్రుప్తి డిమ్రిని సెలక్ట్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..

దేశంలో కొత్త కరోనా వేరియంట్లు..

భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1.. ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించారని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7కు సంబంధించిన 4 కేసులు ఈ నెలలోనే తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.మరోవైపు.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశ అభివృద్ధికి రాష్ట్రాల ప్రగతే పునాది: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యం అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడమే కాకుండా, వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన మద్దతు ఇవ్వాలన్నారు.

కనీస కృతజ్ఞత లేదు…టాలీవుడ్‌ పెద్దలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి

ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON