loader

కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవుడని… కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. వారి వల్ల చాలా నష్టం జరుగుతుందని అన్నారు. వైరల్ అవుతున్న లేఖపై స్పందించారు. మీడియాతో మాట్లాడిన కవిత… ముందుగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఆ లేఖను తానే రాశానని… అది లీక్ కావడం తనకు బాధ కలిగించిందని చెప్పారు.

హైడ్రా తెచ్చిన సంబురం.. పండగే పండగ..

హైదరాబాద్ శివార్లలోని ఫిర్జాదిగూడ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో చిక్కుకున్న రెండు ఎకరాల శ్మశానవాటిక భూమిని తిరిగి పొందడంతో స్థానికులు ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు. టెంట్లు వేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. టపాసులు పేల్చి తమ సంతోషాన్ని చాటుకున్నారు. సమస్య పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.

తిరుమల కొండపై మరో అపచారం..

తిరుమలలో అన్యమతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన ఘటన మరువకముందే మరో అపచారం జరిగింది. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు మద్యం సేవించి తిరుమల కొండపైకి చేరుకోవటమే కాకుండా.. వాహనం నడుపుతూ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. తిరుమలలోని గోపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తమ వాహనంలో కొండపైకి వచ్చిన ముగ్గురు పోలీసులు తమ వాహనాన్ని కర్ణాటకకు చెందిన భక్తుల వాహనంతో ఢీకొట్టారు.

మైసూర్ శాండల్ సోప్… కర్ణాటకలో రచ్చ

కర్ణాటక ప్రభుత్వం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించించింది. ఈ నియామకం కర్ణాటకలోని కన్నడ సంఘాలు, స్థానిక నటీనటులు, సోషల్ మీడియా వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి కన్నడ సంస్థలు ఈ నిర్ణయాన్ని “కన్నడ వ్యతిరేక” చర్యగా, “స్థానిక ప్రతిభకు అవమానం”గా అభివర్ణించాయి.

కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కోవిడ్ కలకలం చెలరేగింది. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది.

కవిత మరో షర్మిల కాబోతుందా?…రఘునందన్ రావు

కల్వకుంట్ల కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ… కల్వకుంట్ల కవిత మరో వైఎస్ షర్మిల కాబోతుందనే అనుమానం కలుగుతుందని చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాలు కల్వకుంట్ల కుటుంబ పంచాయితీనా?, రాజకీయ వారసత్వ పంచాయితీనా?, ఆస్తుల పంచాయితీనా? తెలియాల్సి ఉందన్నారు. ‘మే 2వ తేదీన కవిత రాసిన లేఖ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ప్రజలలో ఎందుకింత చర్చనీయాంశంగా మారింది?. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తన రాజకీయ వారసుడి కేటీఆర్ అని కేసీఆర్ […]

మృత్యువు ముంగిట 14 వేల మంది చిన్నారులు

ఇప్పటికే గజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం అందకుండా చేస్తే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది.

పానీపూరీ అమ్ముతూ ఇస్రోలో జాబ్ కొట్టిన రాందాస్‌..

పానీ పూరీ అమ్ముతూ జీవనం సాగించే ఒక యువకుడు ఇస్రోలో ఉద్యోగం సంపాదించాడు. ఓ పేద కుటుంబంలో జన్మించిన రాందాస్ పట్టుదల, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఇస్రోలో టెక్నీషియన్ ఉద్యోగం సాధించారు. తండ్రి డోంగర్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాందాస్ పగటిపూట పానీపూరీ అమ్ముతూ.. రాత్రిపూట చదువుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ప్రకాశంజిల్లా కొమరోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టపురం వాసులు మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు ఉన్న కారు లారీని ఢీ కొట్టడంతో దుర్ఘటన జరిగింది. 8 మంది మహానంది వెళ్లి వస్తుండగా లారీని ఢీ కొట్టారు ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జాక్‌పాట్ కొట్టిన బెంగళూరు, పంజాబ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు చేరుకునే 4 జట్లు నిర్ణయమైంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. ఇప్పుడు టాప్-2లో నిలిచే పోరాటం తీవ్రమైంది. దీనిలో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు పెద్ద అవకాశం ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON