loader

అరేబియా మహా సముద్రంలో అల్పపీడనం.. అతి భారీ వర్షాలు..

ఋతుపవనాల రాక తర్వాత అరేబియా సముద్రంలో ఈ సీజన్‌లో తొలి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ కారణంగా రానున్న 36 గంటల్లో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నట్టు తెలియజేసింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27న ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఎపిలో తొలి కరోనా కేసు నమోదు

ఎపిలో విశాఖపట్నంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెతో పాటు భర్త, పిల్లలకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశారు. అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. బాధితుతల చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్ నుంచి కోలుకున్నా: శిల్పా శిరోద్కర్

కోవిడ్19 నుంచి కోలుకున్నానని, ఇప్పుడు బాగున్నానని నటి శిల్పా శిరోద్కర్ గురువారం తెలిపింది. 51ఏళ్లున్న ఆమె ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ‘చివరికి కోలుకున్నా, ఇప్పుడు బాగున్నా, మీరు కనబరిచిన ప్రేమకు థ్యాంక్స్, గురువారం ఆనందంగా ఉంది’ అంటూ బాంద్రావోర్లీ సీ లింక్‌లో కారు నుంచి ఓ ఫోటో కూడా పెట్టింది. మాస్క్‌లు ధరించమని, సురక్షితంగా ఉండమని ఆమె తన ఫాలోయర్లని కోరింది.

హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యావరణ హిత ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పిఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

33 మంది అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు అరెస్టు..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో నడుస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసం ముఠాను జిల్లా పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా ఛేదించారు. ఈ ముఠా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని, అమెజాన్ కస్టమర్ సపోర్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతోంది. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ఉద్యోగులను నియమించి, స్క్రిప్ట్‌లు, మోసపు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ఈ దాడుల్లో మొత్తం 33 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ..! ఉలిక్కిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు..!

కేసీఆర్ కు కవిత రాసిన ఆరు పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. అంతర్గత విభేదాలు, కుటుంబ రాజకీయాలు, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కేవలం కేటీఆర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలోని అంతర్గత రాజకీయాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ.. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని కవిత లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడు లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు నిలిపివేత

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) కేసులో ED పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు దాటిందని సుప్రీం కోర్టు, ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టాస్మాక్ అనేది ప్రభుత్వ కార్పొరేషన్ అని.. ఒక కార్పొరేషన్‌పై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేయవచ్చుని ED ప్రతినిధి అడిషనల్ సొలిసిటర్ జనరల్ S.V. రాజును ప్రశ్నించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి మరో 3 వేల మంది అవుట్ : YS షర్మిల సంచలన ఆరోపణలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో మూడు వేల మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతుందని అన్నారు ఏపీపిసిసి చీఫ్ YS షర్మిల. కార్మికుల పక్షాన దీక్ష చేయడం నేరమా అన్న షర్మిల షర్మిల అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలుసా అని ప్రశ్నించారు.

జనసేన ఎమ్మెల్యేకు ముప్పు….

ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 10 రోజుల పాటు ఎలాంటి పర్యటనలు చేయొద్దని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరూ రావొద్దని….ఫోన్‌లోనే సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

కెసిఆర్‌తో ముగిసిన హరీష్ రావు భేటీ..

మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెఆర్‌తో హరీష్ రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వరుసగా రెండో రోజు హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ తో సమావేశమయ్యారు. గురువారం కెసిఆర్ తో హరీశ్ రావు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని హరీశ్ కు కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON