loader

టీటీడీలో కీలక నియామకాలు

టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగు రు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేసారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ఎ.ఎస్.శ్రీ కృష్ణ శేషాచలం దీక్షితులు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ డా.పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన పీ.కే.వరదన్ భట్టాచార్యార్, అర్చకులు ఏ.అనంత శయన దీక్షితులు, మాజీ అర్చకులు ఏ.ఖద్రీ నరసింహాచార్యుల‌ను నూత‌న ఆగ‌మ స‌ల‌హా క‌మిటీలో స‌భ్యులుగా నియ‌మిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు దిగజారి ప్రవర్తించొద్దు..

సోమవారం అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి శరత్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు కీలక సూచనలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రూ.14.5 కోట్లతో ఏపీలో సరికొత్త రైల్వే స్టేషన్..

అమృత్ భారత్ పథకం కింద ఇప్పుడు దేశంలోని చాలా స్టేషన్లను పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తోంది రైల్వే శాఖ.  ఏపీలోని “సూళ్లూరుపేట ” కంప్లీట్ గా న్యూ లుక్ లో రెడీ అయిపోయింది. రేపు అంటే మే 22 న ప్రధాని మోదీ చేతుల మీదుగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభం కాబోతుంది. అమృత్ పథకం లో భాగంగా తొలిసారి ప్రారంభం కాబోతున్న రైల్వే స్టేషన్ ” సూళ్లూరుపేట “

ఉగ్రవాద వ్యతిరేక దినోత్సం

్రతి సంవత్సరం మే 21న దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉగ్రవాదం మరియు హింస యొక్క ప్రమాదాల గురించి, అలాగే వ్యక్తులు, సమాజం మరియు దేశంపై దాని ప్రభావం గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అండర్ కవర్ ఏజెంట్లకు ఆమె ఐఎస్‌ఐ ఎర

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. భారత్‌లో అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ ఆమెను వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్‌ఐ హ్యాండ్లర్ల్లతో ఆమె  కోడ్ భాషలో మాట్లాడినట్టు  దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం.

రాజ్‌భవన్‌కు మార్ఫింగ్ మరక

రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం సంచలనం సృష్టించింది. బాధితురా లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. మార్ఫింగ్ ఫోటోలు చేసింది ఐటి ఉద్యోగి శ్రీనివాస్‌గా తేలడంతో రాజ్‌భవన్ అధికారులు సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ సస్పెన్షన్‌లో ఉండగానే సెక్యూరిటీ సిబ్బందికి తన వస్తువులు లోపల ఉన్నాయని చెప్పి రాజ్‌భవన్‌లోకి వెళ్లి, తన కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్‌ను తీసుకుని వెళ్లాడు.

ట్రంప్-పుతిన్ చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామ చర్చలపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ చర్చల గురించి ట్రంప్ మాట్లాడుతూ… పుతిన్ మంచివాడని, ఆయనతో మాట్లాడిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.  చాలా కాలంగా జరుగుతున్న ఈ సంఘర్షణకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందనే ఆశలు పెరిగాయి.

చైనాను తొక్కేస్తున్న భారత్…

కొన్ని విధానాల వల్ల ఆ దేశం నెమ్మదిగా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనాకు సంబంధించిన పలు పరిశ్రమలు ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. మరోవైపు భారత్ మాత్రం చైనాను దాటుకొని ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉంది భారతదేశంలో ప్రస్తుతం సెమీ కండక్టర్స్, అలాగే డ్రోన్ల తయారీని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

ఉగ్రవాద వ్యతిరేక దినోత్సం

్రతి సంవత్సరం మే 21న దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉగ్రవాదం మరియు హింస యొక్క ప్రమాదాల గురించి, అలాగే వ్యక్తులు, సమాజం మరియు దేశంపై దాని ప్రభావం గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON