loader

ఆన్‌లైన్‌లో పొరపాటున మరొకరికి డబ్బులు సెండ్‌ చేశారా ?

మీరు తప్పుడు UPI IDకి డబ్బు పంపితే వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. ముందు ఆ ట్రాన్సాక్షన్‌ స్క్రీన్‌షాట్‌ తీసుకోండి. వెంటనే మీ బ్యాంక్‌కు కాల్ చేయండి లేదా బ్రాంచ్‌కి వెళ్లండి.సెండర్‌, రిసీవర్‌ అకౌంట్‌ డీటైల్స్‌ సహా ట్రాన్సాక్షన్‌ వివరాలు షేర్ చేయండి. లేదా ట్రాన్సాక్షన్‌ జరిగిన మూడు రోజుల్లోపు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) హెల్ప్‌లైన్‌ 1800-120-1740 కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. త్వరగా కంప్లైంట్‌ చేస్తే రికవరీ అవకాశాలు ఎక్కువగా […]

టర్కీ కంపెనీ సెలెబ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీ సెలెబ్ ఏవియేషన్ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సెలెబ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా, ఈ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పశ్చాత్తాపం కంటే జాగ్రత్తగా ఉండటం ఉత్తమం’ అని జస్టిస్ సచిన్ దత్తా వ్యాఖ్యానించారు.

విశాల్ పెళ్లాడబోతున్న నటి

విశాల్ వివాహం పై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక. అంతే కాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.

మళ్లీ మొదలైన కరోనా భయం

ఇండియాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అప్పుడే 257 కొత్త కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి శిల్పా శిరోద్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.

రోదసిలో సూపర్‌ కంప్యూటర్‌

ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్‌ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ తో పనిచేసే 12 శాటిలైట్స్‌ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్‌ కూటమితో అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను సృష్టించబోతున్నది. చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీ కార్పొరేషన్‌ చేపట్టిన ‘స్టార్‌ కంప్యూటింగ్‌’ ప్రోగ్రామ్‌కు సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్‌ అయ్యిందని చైనా వెల్లడించింది.

నిరుడు ట్రాఫిక్‌ చలాన్లు రూ. 12 వేల కోట్లు

దేశవ్యాప్తంగా నిరుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వేసిన చలాన్ల మొత్తం రూ. 12 వేల కోట్లుగా ప్రముఖ ఆటోటెక్‌ సంస్థ కార్స్‌ 24 సోమవారం పేర్కొంది. ఇందులో రూ. 9 వేల కోట్లు వినియోగదారులు చెల్లించలేదని తెలిపింది. 2024లో మొత్తంగా 8 కోట్ల చలాన్లు జారీ అయ్యాయని, ప్రతి రెండింటిలో ఒక వాహనానికి ఈ జరిమానా పడినట్టు పేర్కొంది.

5జీ తరంగాలతో ఆరోగ్యానికి ముప్పు లేదు

5జీ టెక్నాలజీ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పక్షులకు హానికరమని, మానవుల మెదళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని అనుమానాలు ఉండేవి. ఇవన్నీ అపోహలేనని, 5జీ తరంగాలతో మానవులకు ఎలాంటి హానీ లేదని, జర్మనీకి చెందిన కన్‌స్ట్రక్టర్‌ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం రూఢీ అయ్యింది. మానవ చర్మ కణాలను అత్యంత శక్తివంతమైన 5జీ తరంగాల తాకిడికి గురిచేయగా, మానవుల్లో జన్యు వ్యక్తీకరణ, మిథైలేషన్‌ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పులు రాలేదని సైంటిస్టులు గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON