loader

తల్లికి వందనం సహా 10 అంశాలపై సీఎం చంద్రబాబు సర్వే!

వచ్చే 3 నెలలపాటూ.. భారీగా ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం IVRSని ఉపయోగించబోతోంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల గురించి అడుగుతారు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని బట్టీ.. ఆ పథకం తీరుతెన్నులు ఉంటాయి. ఈ సర్వే కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. దీని ద్వారా.. ప్రతీ పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలిసిపోతుంది.

నారా లోకేశ్‌కు ప్రమోషన్..!?

లోకేశ్‌కు పార్టీలో పగ్గాలు అప్పగిస్తే బెటర్ అనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 29న టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబు నాయడు మహనాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ విషయంలో కేసీఆర్ అప్లై చేసిన ప్లాన్‌నే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా, అప్లై చేసే అవకాశం కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం..

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్‌ వేసిన స్కెచ్‌ను చాకచక్యంగా చేధించారు. కుట్రకు ప్లాన్‌ చేసిన సిరాజ్‌.. విజయనగరంలో అరెస్ట్‌ అవడంతో షేక్‌ అయింది. విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ అనే వ్యక్తిని కోర్టు అనుమతితో ఇద్దర్నీ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు.

రాజధాని అమరావతికి క్లియరెన్స్?

రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి భేటీ కాబోతోంది. ఇది 48వ సమావేశం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.ఇందులో చర్చకు వచ్చిన అంశాలు, ప్రతిపాదనలను మంత్రివర్గంలో ఆమోదించవచ్చు.

వైద్య కళాశాలలకు ఇక రేటింగ్‌

ఇండిపెండెంట్‌ థర్డ్‌ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్‌), రేటింగ్‌ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మెడికల్‌ అసెస్‌మెంట్‌, రేటింగ్‌ బోర్డ్‌ రూపొందించిన మొత్తం 11 ప్రమాణాలు, 78 పారామితులతో ఒక ముసాయిదాను విడుదల చేసింది. వైద్య కళాశాలలు అత్యున్నత ప్రమాణాలు సాధించడం కోసం అవి జవాబుదారీతనం, నిబద్ధతతో పనిచేసేలా చేసేందుకు రేటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఎన్‌ఎంసీ అధ్యక్షుడు గంగాధర్‌ తెలిపారు.

తెలంగాణలో లిక్కర్ ధరలు పెంపు..!

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు తాజాగా లిక్కర్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ‌లభించినట్టుగా తెలుస్తోంది. విస్కీ, బ్రాందీ క్వార్టర్‎పై రూ.10, ఆఫ్ బాటిల్‎పై రూ.20, ఫుల్ బాటిల్‎పై రూ.40 చొప్పున ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు జారీ చేసిన సర్క్యూలర్‌లో ఎక్సైజ్ శాఖ పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పెరిగిన ధరలు ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా […]

తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్‌ కష్టాలు

గర్భిణులు, బాలింతలను ఇండ్లకు చేర్చే ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలకు డీజిల్‌ కష్టాలు ఎదురయ్యాయి. డీజిల్‌ లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదోని ప్రభుత్వ స్త్రీల, చిన్నపిల్లల ఆస్పత్రిలో ఏడు‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ’ వాహనాలు ఉన్నాయి. హొళగుందకు చెందిన బేబీ అనే బాలింత ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి వేడుకుంది. ఆయన మాత్రం స్పందించలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON