మానవాళికే ముప్పుగా పాక్
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికే ముప్పుగా మారిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న అఖిల పక్ష ప్రతినిధి బృందాల సభ్యుడిగా అంతర్జాతీయ సమాజానికి తాను ఇచ్చే సందేశ సారాంశం ఇదేనని శనివారం పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ వెల్లడించారు.