loader

ఆఫీస్‌ బాయ్‌ని చెప్పుతో కొట్టిన ఎక్సైజ్‌ సీఐ..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ వివాదంలో చిక్కుకున్నారు.. ఆమె ఆఫీస్‌బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ‘మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకొని నాపై చెబుతావా.. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా’ కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ సీఐ హసీనాభాను ఆఫీస్‌ బాయ్‌ని చెప్పుతో కొట్టారు. కొంతకాలంగా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని హాసీనాభాను చెబుతున్నారు.. అయితే అటెండర్ మాత్రం తనకు ఏం తెలియదు అంటున్నారు.

ఏపీలోని ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తే‌.. కేసులు

శేషాచలం అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించే వారి భరతం పట్టేందుకు అటవీ శాఖ సమాయత్తమైంది. కొండలు, గుట్టలు దాటి సాహస యాత్రలకు వెళ్లే ముఠాలపై నిఘా పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖబడ్దార్! తలకోన, అన్నమయ్య జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో రహస్యంగా ట్రెక్కింగ్ నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక కమిషన్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ద్వారా ట్రెక్కర్లను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ట్రెక్కింగ్ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖ సిద్ధమవుతోంది.

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఏపీలో విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కం(Transco, Genco, Discom)లలో ఉద్యోగుల సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆరు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA)-1971 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రాజ్ తో సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని దీవించిన నటి

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇటీవల సమంత శుభం చిత్రంతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ ఇప్పుడు బహిరంగ రహస్యం. నాకు అవకాశం ఇచ్చిన సమంతకి శుభం. రాజ్ తో సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని మధుమణి దీవించారు. మధుమణి కామెంట్స్ కి […]

భారతీయులపై కక్ష కట్టిన ట్రంప్ ?!

అమెరికాలోని వారు తమ కుటుంబసభ్యులకు పంపే డబ్బు పైనా ట్రంప్ కోత పెడుతున్నాడు. ఆమెరికా పౌరులు కానివారు విదేశాలకు చేసే చెల్లింపులపై 5 శాతం పన్ను విధించే కొత్త బిల్లును ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ బిల్లు చట్టం అయితే అమెరికా నివసిస్తున్న , పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులపై నేరుగా ప్రభావం చూపుతుంది. వారు క్రమం తప్పకుండా స్వదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపుతూ ఉంటారు.

మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం: పవన్ కల్యాణ్

‘పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే.. మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం. మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తోంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి’  సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు… దేశాన్ని నడపరు. సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి’అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON