సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ లో ప్రత్యేక బోర్డ్ రూమ్
భారత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప క్షణం చోటుచేసుకుంది. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ అరుదైన గౌరవం అందించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ‘10,000 గవాస్కర్’ పేరిట ఓ ప్రత్యేక బోర్డు రూమ్‌ను ప్రారంభించారు. ఈ గదిని పూర్తిగా గవాస్కర్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించారు.గదినంతా గవాస్కర్ ఫొటోలు, భారత జట్టు విజయాల ట్రోఫీలు అలంకరించబడ్డాయి.