loader

ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్..

తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు ఆన్‌లైన్‌లో జరుపుకునేందుకు వీలుగా 2020 అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ధరణి పోర్టల్‌ నిర్వహణ విదేశీ సంస్థలకు అప్పగించడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రాష్ట్రంలోని భూ రికార్డులను తారుమారు చేసి తమ పేర్లపైకి మార్చుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ధరణిలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ధరణిపై ఫొరెన్సిక్‌ అడిట్‌కు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్‌ […]

కృష్ణా జ‌లాల్లో 70 శాతం తెలంగాణకు రావాల్సిందే- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కీలక చర్చ జరగింది. తెలంగాణలోనే 70 శాతం నది ఉన్నందున కచ్చితంగా 70 శాతం నీళ్లు సాధించాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాబోయే రెండేండ్లలో అంటే 2027 జూన్ నాటికి కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపారు.

డీఎస్సీ పరీక్ష సన్నద్ధతకు 90 రోజుల సమయం ఇవ్వాలి.. దరఖాస్తు గడువు పెంచాలి’ నిరుద్యోగుల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తు గడువు నేటి (మే 15)తో ముగియనుంది. డీఎస్సీ గడువు, వయోపరిమితి, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థులు నిరసన చేస్తున్నారు. ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని, పరీక్షకు కనీసం 90 రోజులను సమయం ఇవ్వాలని కోరుతున్నారు. వయోపరిమితి 44 […]

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం నోటీసులు

అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ప్రధాన ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ జాతీయ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయడం అంటే దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది.  ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో పాకిస్తానీ జాతీయ జెండాలు, పాకిస్థాన్ దేశ ముద్ర ఉన్న వస్తువుల అమ్మకాల పై సెంట్రల్ కన్స్యూమర్ […]

గ్యాస్ సిలిండర్ తీసుకోకపోయినా డబ్బులు..

ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పద్ధతిలో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్‌ తీసుకోకపోయినా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్‌కు లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ప్రకటలో వెల్లడించింది. గతంలో నీరజ్ చోప్రా భారత సైన్యంలో సుబేదార్‌గా వ్యవహరిచారు.

ఒకే రోజు లక్షమందికి పింఛన్లు….ప్రతినెలా సంక్షేమం…టీడీపీ పొలిట్ బ్యూరో

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కీలకమైన 12 అంశాలపై చర్చించాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 16, 17, 18 తేదీలలో మూడు రోజులు అన్ని నియోజకవర్గాల్లో తిరంగ ర్యాలీలు జరపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి…ఇబ్బందులుంటే ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం, మే నెలాఖరుకు పార్టీ సంస్థాగత ఎన్నికలన్నింటిని పూర్తి చేస్తాం అని అని టీడీపీ పొలిట్ […]

వేయిస్తంభాల గుడిలో, రామప్ప ఆలయంలో మిస్‌ వరల్డ్ బ్యూటీస్

మిస్‌‌వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు వరంగల్‌లోని రామప్ప ఆలయం, వేయి స్తంభాల దేవాలయాలను సందర్శించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో స్థానికులు సాదదరంగా ఆహ్వానించారు. కాకతీయుల చారిత్రక కట్టడాల వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది.

జైషే చీఫ్ మసూద్‌కు రూ.14కోట్ల ఎక్స్‌గ్రేషియా

ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులతోపాటు అతడి సన్నిహితులు మొత్తం 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ దాడుల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు  ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది మృతులు ఒక్కొక్కరికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON