loader

గ్రీస్‌లో భారీ భూకంపం… పలు దేశాల్లో భూప్రకంపనలు…

గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. గ్రీస్‌లోని కార్పాథోస్, కాసోస్ దీవుల సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రోజున భూకంపం చోటుచేసుకుంది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌‌పై 6.1గా నమోదైంది.భూకంప కేంద్రం కాసోస్ రాజధాని ఫ్రై నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో, ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పలు దేశాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్, తుర్కియే, ఈజిప్ట్, లిబియాతో సహా విస్తృత ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.

ఉప్పల్ కు మొండిచెయ్యి

ఐపిఎల్ సీజన్ 2025ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మ ధ్యలోనే నిలిపి వేసింది. అయితే యుద్ధ మేఘాలు తొలగిపోయి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడంతో ఐపిఎల్‌ను తిరిగి నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఆగిపోయే సమయానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో ఒకటి లీగ్ మ్యాచ్ కాగా, మరో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, తాజా షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు ఒక్క మ్యాచ్ కూడా […]

పాక్‌ హైకమిషన్‌ అధికారిని బహిష్కరించిన భారత్‌

తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్‌ హై కమిషన్‌ అధికారిని భారత్‌ మంగళవారం బహిష్కరించింది. అతను 24 గంటల్లో భారత్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు మళ్లీ అనుమతి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సిఫారసు లేఖలను తాత్కాలికంగా పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి లేఖలను తిరిగి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు 10,01,115 సార్లు గోవింద కోటి రాసిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారు గోవింద కోటి పూర్తి చేసిన వారు ఆ పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్‌ కార్యాలయంలో అందిస్తే మరుసటి […]

ట్రేడింగ్‌తో కోట్లు కొల్లగొడుతున్నారు..!

సైబర్‌ నేరగాళ్లు ట్రేడింగ్‌ ఫ్రాడ్‌కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్‌ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌నేరగాళ్లు.. తమ సొంత యాప్‌లు, వెబ్‌సైట్లలో లాగిన్‌ ఐడీలు ఇచ్చి అందులో నుంచే స్టాక్స్‌ కొనిపిస్తున్నారు. యూపీఐ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలను బాధితులకు పంపిస్తూ ఆయా ఖాతాల్లో డబ్బులు డిపాజిట్‌ చేయాలని సూచనలు చేస్తున్నారు.

సింధు జలాల ఒప్పందం అప్పటివరకు రద్దే : భారత విదేశాంగ శాఖ

చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. కానీ దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల దానిని నిలిపివేయబడిందని. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు. “నీరు మరియు రక్తం కలిసి ప్రవహించలేవు” అని చెబుతూ ఈ ఒప్పందంపై భారతదేశం యొక్క దృఢమైన వైఖరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం నిలిపివేయడం భారత-పాకిస్తాన్ ఉద్రిక్తతలను గణనీయంగా పెంచింది. ఈ చర్యను “యుద్ధ చర్య” అని పిలుస్తూ పాకిస్తాన్ దానిని […]

వారం ముందుగానే అండమాన్‌కు ‘నైరుతి’.. ఏపీలో వర్షాలు!

అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు సాధారణంగా మే 21 నాటికి ప్రవేసిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం వారం ముందుగానే ప్రవేశించాయి. దీంతో గడచిన 24 గంటల నుంచి నికోబార్ దీవులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో అండమాన్, నికోబార్‌ దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

ఇంటి ముందు ఎస్పీ. . ఖంగుతిన్న తెనాలి రౌడీ షీటర్లు..!

తెనాలి రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు‌.. స్థానికులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయనే నేరుగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి, ప్రస్తుతం వారి ప్రవర్తనపై ఆరా తీశారు. రౌడీ షీటర్లు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ వెళుతున్నారా లేదా అనే విషయాన్ని, వాళ్ళ ప్రవర్తనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులు […]

హరికృష్ణ మనవడి సినిమా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్ చేయలే?

హరికృష్ణ తనయుడు, దివంగత జానకిరామ్ తనయుడు (ఎన్టీఆర్) హీరోగా కొత్త సినిమా మొదలైంది. హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం జరిగితే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక్క ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశం అవుతుంది. సినిమా ప్రారంభోత్సవం రోజున ఎన్టీఆర్ కుమార్తెలు అటెండ్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్స్ చేశారు. సినిమా ప్రారంభోత్సవం రోజున హరికృష్ణ కుమారులు కనిపించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదని చాలా మంది వేలెత్తి చూపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON