loader

తలకొన అడవిలో అసాంఘిక కార్యకలాపాలు..

అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి.తలకోన ఫారెస్ట్‌ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇటీవల కాలంలో తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది. సైట్‌ సీయింగ్‌తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. మందుపార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మందు పార్టీలు చేసుకుంటున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. యువకులతో పాటు వాళ్లలో ఇద్దరు యువతులు […]

జీవో నెం 3 పునరుద్ధరణ.. వంద శాతం ఛాన్స్ వారికే ?

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు, వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 3 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేసిన విషయం తెలిపారు. జీవో 3 పునరుద్ధరణకు న్యాయపరంగా ఉన్న అవకాశాలు, అడ్డంకులపై అధికారులతో సీఎం చర్చించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు, వారిని మళ్లీ ఆ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని […]

ఏపీలో భిన్న వాతావరణం..ఓ వైపు ఎండలు ..మరోవైపు వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో వేసవిలో వాతావరణం తారుమారవుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయానికే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం ఇంట్లోనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఒకటి గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా.

బుద్ధవనంలో సుందరీమణుల సందడి

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లలో ఆసియా ఓసియాన గ్రూప్ -4 లోని 22 దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. స్థానిక ప్రభుత్వ అధికారులు సంప్రదాయ రీతిలో జానపద, గిరిజన నృత్య కళాకారులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాంగణాన్ని కలియదిరిగి వారంతా అందమైన దృశ్యాలను సెల్పీ లు తీసుకున్నారు.  బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు […]

బీసీల్లో కులాల చేర్పుపై అభ్యంతరాల స్వీకరణ

2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలనే అంశంపై, పలు కులాల పేర్ల మార్పుపై అభ్యంతరాలను 31లోగా సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ చెప్పారు. ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ సభ్యులతో చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. 26 కులాలనుజాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణతోపాటు వినతులు, అభ్యంతరాలు స్వీకరించాలని కమిషన్‌ నిర్ణయించింది.

నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం..

రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకానికి గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పీవీ శ్రీనివాస్‌రావు, పర్విన్‌ మోహిసిన్‌, దేశాల భూపాల్‌, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. సీఎం కార్యాలయంలో సీపీఆర్వోగా పనిచేస్తున్న బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎంపికపై దుమారం రేగుతున్నది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పూర్తిస్థాయిలో రాజకీయ నేపథ్యం ఉన్నది. పక్కా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని సమాచార కమిషనర్‌గా ఎలా నియమిస్తారని పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.

షరతుల్లేని గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చెల్లదు.. హైకోర్టు స్పష్టీకరణ

ప్రేమ, వాత్సల్యంతో మనుమళ్లకు  షరతులు విధించకుండా ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం కింద రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చె ప్పింది. ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించినప్పుడే సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేసుకునేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాకొండాపూర్‌లోని ఓ భవనం బహూకరిస్తూ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను తన తాత  ఫిర్యాదు మేరకు ఆర్డీవో రద్దు చేయడంపై అమెరికాలోని రోహిత్‌ శౌర్య పిటిషన్‌ దాఖలు చేయడంతో […]

ఆర్ఆర్ఆర్ లా మూడేళ్లు సినిమా తీయను.. రాజమౌళిపై లోకేష్ కనగరాజ్‌ సెటైర్లు

లోకేష్ కనగరాజ్, రాజమౌళి మీద విమర్శ చేశారని చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు. నిజానికి ఏం జరిగిందంటే.. ‘కూలీ’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, `ఆర్ఆర్ఆర్` సినిమాని ఉదాహరణగా చెప్పి మాట్లాడారు. “ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థలాగా నేను మూడు సంవత్సరాలు సినిమా తీయను. ఎందుకంటే, ఏ నటుడికైనా ఒక సినిమాకి మూడు సంవత్సరాలు కేటాయించడం కష్టం. ఆ సమయంలో వేరే సినిమా ఒప్పుకోవడం కూడా కష్టమే. నా సినిమాలో నటించేవాళ్ళు ఆ పాత్రనే జీవించాలి కాబట్టి నేను […]

సైనికులకు సెల్యూట్: ఆపరేషన్ సింధూర్ పై మోదీ

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. “గత కొన్ని రోజులుగా దేశం చూపిన సహనం, సామర్థ్యం అంతా మేము చూశాం. సైన్యం, మిలటరీ, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, శాస్త్రవేత్తలందరికి నమస్కరిస్తున్నాను” అని ఆయన తెలిపారు. భారత త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేశారు. దేశం మొత్తం సైనికులకు మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు.

1.75లక్షల ఎకరాల భూమి తాకట్టుకు కుట్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్‌చేంజీలో కుద బెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లక్ష 75 వేల ఎకరాల టిజిఐఐసి భూములను స్టాక్ ఎక్స్‌చేంజీలో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఎంఎల్‌సి కవిత విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టిజిఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ ప్రభుత్వం రహస్య […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON