loader

ట్రంప్‌కి లగ్జరీ విమానం గిఫ్ట్ ఇస్తోన్న ఆ దేశం..

ఖతార్‌ రాజ కుటుంబం నుంచి ఖరీదైన బహుమతి అందుకోనున్నారు. విలాసవంతమైన 747-8 విమానాన్ని ట్రంప్‌కు అందజేయనున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌కు తగ్గట్టుగా దీనిలో మార్పులు చేయనున్నారు. ఈ విమానం విలువ సుమారు భారత కరెన్సీలో దాదాపు రూ.3400 కోట్లు ఉంటుంది.అధ్యక్ష పీఠం దిగిపోయేవరకూ ఈ విమానాన్ని ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షనుగా వినియోగిస్తారు. అనంతరం అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు అప్పగిస్తారు. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ రకంగా లంచమే? […]

అమెరికా, చైనా ట్రేడ్ వార్‌లో ట్విస్ట్..

అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో మరింత తీవ్రమైంది. ఒకదానిపై ఒకటి భారీ టారిఫ్‌లు విధించడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారాయి. జెనీవాలో రెండు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ముగిసిన తరువాత ఒప్పంద గురించి తాజాగా ప్రకటన వెలువడింది. అమెరికా వస్తువులపై సుంకాలను 125 నుంచి నుంచి 10 శాతానికి చైనా.. చైనా వస్తువులపై 145 నుంచి 30 శాతం […]

మరో ఇద్దరు వీర జవాన్లను కోల్పోయిన భారత్‌!. . అమరులైన మెహమ్మద్‌, దీపక్‌

జమ్మూ డివిజన్‌లోని ఆర్‌ఎస్ పురా ప్రాంతంలో మే 9, 10 తేదీల మధ్య పాకిస్తాన్ రేంజర్లు జరిపిన సరిహద్దు కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దీపక్ చింగాఖం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. ఇదే కాల్పుల్లో మరో జవాన్, సబ్-ఇన్‌స్పెక్టర్ మెహమ్మద్ ఇంతేయాజ్ కూడా మృతిచెందారు. బీఎస్‌ఎఫ్ వారి త్యాగాన్ని స్మరించి పూర్తి గౌరవాలతో నివాళులు అర్పించింది.

ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదు.. మాకు అండగా నిలవండి.. కరాచీ బేకరీ యజమానుల ఆవేదన

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ కరాచీ బేకరీపై దాడి జరిగింది. బజరంగ్‌దళ్ కార్యకర్తలు బేకరీ ఫర్నీచర్ ధ్వంసం చేసి, పేరు మార్చాలని హెచ్చరించారు. ఈ దాడులపై కరాచీ బేకరీ యజమాని వారసులు మీడియాతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో  అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్‌లను కోరారు. తాము హైదరాబాద్‌కు చెందిన వారమని.. ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భారతీయ బ్రాండ్ కాబట్టి.. సాధారణ ప్రజలు […]

దేశాభివృద్ధిలో సాంకేతిక రంగం కీలకం

ప్రపంచానికి నూతన సాంకేతికతను అందించడంలో సీఎస్‌ఐఆర్‌ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ఆదివారం నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ సైన్స్‌, హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో.. ఐఐసీటీలో నిర్వహించిన నేషనల్‌ టెక్నాలజీ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్రను పోషిస్తుందన్నారు.

స్టేజ్ పైనే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్..

హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోయారు. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్‌జెండర్‌ అందాల పోటీలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. స్టేజ్ మీదకు వచ్చిన విశాల్.. సడన్ గా సొమ్మసిల్లి పడిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాల్ స్పృహతప్పి పడిపోయిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్లనే నటుడు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తమిళ మీడియా పేర్కొంది.

తెలంగాణలో వారి కులాల పేర్లలో మార్పులు.. వచ్చే నెలలోనే సమీక్ష..

ెలంగాణ బీసీ కమిషన్‌కు దొమ్మరి, పిచ్చకుంట్ల వర్గాలు తమ కులం పేర్లను మార్చుకోవడానికి విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుత పేర్ల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. బీసీ కమిషన్ వెనకబడిన తరగతుల కులాల ప్రజలకు సమన్యాయం చేసేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చింది. దొమ్మరి కమ్యూనిటీ సభ్యులు తమ కులం పేరును ‘గాడే వంశీయులు’గా మార్చాలని కోరారు. పేరు మార్పుల కోసం చేసిన అభ్యర్థనలను వచ్చే నెలలో సమీక్షిస్తామని సంఘాలకు హామీ ఇచ్చారు.

సీజ్‌ ఫైర్‌ పై సల్మాన్ ఖాన్ ట్వీట్, నెటిజన్ల ట్రోల్‌..

ఆపరేషన్ సింధూర్’ మొదలై ఇన్ని రోజులైనా బాలీవుడ్‌లోని నటుల నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఉగ్రదాడి గురించి గానీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నీచ చర్య గురించి గానీ, కనీసం భారతదేశానికి మద్దతు ఇచ్చి, మన సైనికులను అభినందించడం గానీ… ఏమీ లేదు.సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, ‘యుద్ధ విరమణ ప్రకటించినందుకు థ్యాంక్ గాడ్’ అని. అంతే..దీంతో తీవ్రంగా ట్రోల్ అయ్యారు. నెటిజన్లు ఆయనపై మండి పడ్డారు. దీంతో […]

డోనాల్డ్ ట్రంప్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

భారత పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ అమలు జరిగినా లేకపోయినా టెర్రరిస్టుల ఏరివేతను కొనసాగించాలన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల్ని విడిచి పెట్టే ప్రసక్తే ఉండకూడదన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ బ్రోకర్ అని అసదుద్దీన్ అభివర్ణించారు. 1972 షిమ్లా ఒప్పందం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నానని, అంతర్గత సమస్య కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం ఎందుకని ప్రశ్నించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON