loader

మీడియా చేసిన యుద్ధం

పహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేసిన సంఘటనలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకున్నదే తప్ప మన భారతదేశ మీడియాకు మాత్రం అంత ఓపిక లేదు. సంఘటన జరిగిన మరునాటి నుండే మన మీడియా.. ముఖ్యంగా 24 గంటల వార్తా ప్రసారాలు చేసే న్యూస్ ఛానళ్లు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేసాయి. ‘ఇంకా ఆలస్యం దేనికి? యుద్ధం మొదలు పెట్టండి’ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గదమాయిస్తున్న, సలహాలిస్తున్న ప్రసారాలు అనేకం మనకి ఈ […]

ఇకనుంచి ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తాం

పాకిస్థాన్ లేదా ఏ ఇతర దేశం, ఏ శక్తి నుంచి ఉగ్ర వాద దాడులు జరిగినా , హింసాత్మక చర్యలు తలెత్తినా వీటిని భారతదేశం యుద్ధ నేర చర్యగా పరిగణిస్తుంది. ఈ మేరకు ఇటువంటి కవ్వింపు చర్యలను యుద్ధంలో మాదిరిగానే తిప్పికొడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం రాత్రి ఉన్న తస్థాయి సమావేశం జరిగింది. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్, సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పాకిస్థాన్‌తో యుద్ధం వల్ల భారత్‌కు ఒక్కరోజుకు అయ్యే ఖర్చు.. !

5,00,00,00,000 ఈ నెంబర్ ఏంటనుకుంటున్నారా..? ఇండియా పాకిస్థాన్ యుద్ధంలో భారత్ తన సైనిక బలగాలు, యుద్ధ నిర్వహణకు చేస్తున్న ఒక్కరోజు ఖర్చు.. అది ఎంతో తెలుసా..? అక్షరాల ఐదువేల కోట్లు. భారత్ లాంటి దేశం ఒక్క రోజు యుద్ధం చేయాలంటే ఖర్చు చేయాల్సిన మొత్తం అది. యుద్ధమంటే .. ఫిరంగులు..విమానాలు.. బాంబులే కాదు.. వేల కోట్ల డబ్బు. ఒక దేశం ఒక్కసారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవలసిందే.

డిజిటర్‌ రూపీ శకం మొదలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్‌ రూపీ ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది.. డిజిటల్‌ రూపీతో మరో ముందడుగు వేయనున్నది. డిజిటల్‌ రూపీ అంటే ఆర్బీఐ తయారుచేసిన ఒక డిజిటల్‌ డబ్బు. ఇది కరెన్సీ లాంటిదే! దీని విలువ కూడా మన కరెన్సీతో సమానమే!అంటే 1 డిజిటల్‌ రూపీ 1 రూపాయికి సమానం. కాకపోతే మన ఫోన్లో ఉంటుంది. ఈ డబ్బును ఆర్బీఐ నేరుగా ఇస్తుంది. బిట్‌ కాయిన్‌లాంటి ప్రైవేట్‌ కరెన్సీలతో […]

నగ్రోటా మిలిటరీ స్టేషన్‌ వద్ద కాల్పులు.. గాయపడ్డ భారత జవాన్!

జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేసిన్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.

లండన్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెర్రీతో పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్ విగహాన్ని కూడా ఏర్పాటు చేసారు. టుస్సాడ్స్ చరిత్రలోనే […]

అంతర్జాతీయ మాతృ దినోత్సవం

అంతర్జాతీయ మాతృ దినోత్సవం కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905, మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్‌జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని  తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ […]

పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు ఎమ్మెల్సీ కవిత సన్మానం

పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె నివాసంలో సన్మానించి అభినందించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను కాపాడేందుకు కృషిచేస్తూ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పొందడం తెలంగాణకు గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా 40వేల ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్య, అతడి బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావానంతరం ప్రభుత్వ పక్షాన అనేక చైతన్య, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు.

దోస్త్‌ కాదు దుష్మన్‌. భారత్‌పై విషం కక్కిన తుర్కియే, డ్రాగన్..

మనం ఆపరేషన్‌ దోస్త్‌ అంటూ ఆపన్న హస్తం అందిస్తే..వాళ్లు మనకు దుష్మన్లుగా మారారు. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు. ద్రోహం చేస్తే..! ఇప్పుడదే పని తుర్కియే చేసింది. ఇక చైనా కూడా తన అవసరాలు, ప్రయోజనాల కోసం పాక్‌పై ప్రేమ ఒలకబోస్తోంది. భారత్‌పై విషం కక్కుతోంది. తుర్కియే, చైనాలకు మనం చేతనైనంత ఉపకారం చేశామే కానీ, ఎలాంటి అపకారం చెయ్యలేదు. అయినా ఆ రెండు దేశాలు పాక్‌కి కొమ్ము కాశాయి.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు ప్రమోషన్లు, కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే మహిళా పోలీసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా హోం శాఖలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకుంటే.. ఐసీపీఎస్‌, మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు వారికి అప్పగిస్తారు. ఒకవేళ హోం శాఖను ఎంచుకుంటే, ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. ఈ మేరకు గ్రామ, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON