loader

భారత్‌పై విషం చిమ్ముతున్న పాక్- ఆ వీడియోపై కేంద్రం క్లారిటీ

పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులు భారత్‌పై విషం చిమ్ముతున్నాయి. దుష్ప్రచారానికి తెర తీశాయి. పాత వీడియోలను  తాజాగా పోస్ట్ చేస్తోన్నాయి. భారత్‌లోని ఆర్మీ పోస్టులను నిర్వీర్యం చేసినట్లు చెప్పుకొంటోన్నాయి. ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపై విధ్వంసక దాడిని చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాయి. ఆ వీడియోలు ఇప్పటివి కావు. 2021 జులై 7వ తేదీన హజీరా పోర్ట్‌లో ఓ ట్యాంకర్‌ పేలుడుకు సంబంధించిన వీడియోలు అవి. వాటిని ఇప్పుడు సర్కులేట్ చేస్తోన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో […]

భారత సైన్యం కోసం కామాఖ్య దేవాలయంలో భక్తుల ప్రత్యేక ప్రార్థనలు

పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు, దురాక్రమణ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం అస్సాం, గువాహటిలోని కామాఖ్య దేవాలయంలో భక్తులు భారత సైన్యం కోసం ప్రార్థనలు చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారతదేశ సమగ్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చాలామంది కోరుకుంటున్నారు.”భారత సైన్యం చేస్తున్న అద్భుతమైన పనికి మేము నిజంగా గర్వపడుతున్నాం. ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించే వరకు వారు దీన్ని కొనసాగించాలి అని భక్తురాలు అన్నారు.

ఏపీ జ‌వాన్ జ‌మ్మూక‌శ్మీర్‌లో వీర‌మ‌ర‌ణం..

శ్రీ స‌త్య‌సాయి జిల్లాకు చెందిన జ‌వాన్ జ‌మ్మూక‌శ్మీర్‌లో వీర‌మ‌ర‌ణం పొందారు. గోరంట్ల మండ‌లం గ‌డ్డంతండా పంచాయ‌తీ ప‌రిధిలోని క‌ల్లితండాకు చెందిన ముర‌ళీనాయ‌క్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు శుక్ర‌వారం ఉద‌యం స‌మాచారం అందింది. స‌రిహ‌ద్దులో చొర‌బాటుదారుల కాల్పుల్లో ముర‌ళీనాయ‌క్ ప్రాణాలు విడిచిన‌ట్లు అధికారులు వారి కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.

INS విక్రాంత్ దాడి: కరాచీ నాశనం

ఈ వార్తలను అధికారికంగా సైన్యం గానీ, బాధ్యతగల వ్యక్తులు గానీ ఇపపటి వరకూ ధృవీకరించలేదు. కొన్ని మీడియా కథనాల ప్రకారం, INS విక్రాంత్ నుండి ప్రయోగించిన క్షిపణులు నేరుగా పాకిస్తాన్ నౌకాదళ స్థావరాలను, వారి  ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని చెబుతున్నారు. కరాచీ ఓడరేవుపై వరుసగా 12 పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి, ప్రజలు ప్రాణాలను రక్షించుకోవడానికి ఇళ్ల నుండి బయటకు పరుగులు […]

300-400 డ్రోన్లతో భారత్‌పై పాక్ దాడులు.. దొంగచాటు దెబ్బను తిప్పికొట్టిన సైన్యం

సాయంత్రం 8:30 గంటలకు డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించిన పాకిస్తాన్ తన సివిల్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయలేదని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వెల్లడించారు. భారత్‌పై చేసిన దాడికి.. వెంటనే ఇండియన్ ఆర్మీ ప్రతిస్పందింస్తుందని తెలిసినప్పటికీ.. పాకిస్తాన్ తమ పౌర విమానాలను ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకుందని తెలిపారు. భారత్ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో మన పౌర విమాన రాకపోకలు లేకుండా పూర్తిగా ఖాళీగా ఉందని..  అయితే అదే సమయంలో కరాచీ, లాహోర్ మధ్య విమాన మార్గంలో పౌర విమానాలు […]

విశాఖలో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత మరో ఘనకార్యం..

విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రెండు వేల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఆమె, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డారు. జైలుకు వెళ్లొచ్చినా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఆమె చేసిన మరో ఘనకార్యం బయటపడింది. తాజాగా స్వర్ణలత, సుధాకర్ కలిసి విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు..

ఒక్కసారిగా కుంగిపోయిన నేషనల్ హైవే..

ఏపీలోని కర్నూలు దగ్గర దూపాడు దగ్గర రింగురోడ్డు వద్ద బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే-44పై భూమి కుంగిపోయింది. ఆరు మీటర్ల వెడల్పు, పదహారు మీటర్ల లోతులో పెద్ద గొయ్యి ఏర్పడింది. హైవే పక్కన రోడ్డు కుంగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. హైవేలో గుంత ఏర్పడటంతో.. కొన్ని వాహనాలను మరో దారిలో పంపించారు. అయినా చాలా వాహనాలు రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

3 సైనిక స్థావరాలే టార్గెట్ గా పాక్ దాడులు : భారత రక్షణ శాఖ

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. గురువారం రాత్రి ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు, ప్రతిదాడులకు దిగారు. జమ్మూ, పఠాన్ కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడ్డట్లు రక్షణ శాఖ తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దును దాడుకుని వచ్చి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులకు దిగినట్లు తెలిపారు. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఈ దాడులకు సమర్ధవంతంగా అడ్డుకుంది.

ఇండో-పాక్ గొడవ మాకేం సంబంధం లేదు: జేడీ వాన్స్

ఇండియా-పాకిస్తాన్ గొడవ ప్రాథమికంగా ‘అమెరికా వ్యవహారం కాదు’ అని, పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలను అమెరికా కోరగలదని, కానీ ఈ గొడవలో జోక్యం చేసుకోలేమని వాన్స్ అన్నారు.” అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం గురించి అమెరికా ఆందోళన చెందుతోందని, అలా జరగకుండా నిరోధించడానికి కృషి చేస్తోందని వాన్స్ అంగీకరించారు.

రాఫెల్‌ను రప్ఫాడిస్తుంది

శివాంగి సింగ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించింది. ఎంతో తెలివైన విద్యార్థిని. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించేది. భారత వాయుసేనలో 2017లో ఫైటర్‌ పైలట్‌గా చేరిన శివాంగి.. కొద్దిరోజుల్లోనే దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. 2020లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నిర్వహించిన వివిధ పరీక్షల్లో నెగ్గి.. ఫ్రెంచ్‌ శిక్షకులతో సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌కు ఎంపికైంది. అందులో కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని.. రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నది. రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON