loader

రవీంద్రనాథ్ ఠాగూర్

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ లో జన్మించాడు రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో అభ్యసించేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి  అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన.

బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా ఇతను ఏం చేశాడో చూడండి

మత్తుమందుల వాడకం, బెట్టింగ్ యాప్‌లపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మణిపూర్ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఐసో ను విజయవంతంగా అధిరోహించాడు. యశ్వంత్ PTIతో మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా వేలాది మంది బెట్టింగ్ యాప్‌లకు బానిసలవుతూ తమ శ్రమఫలితాన్ని కోల్పోతున్నారు. అలాగే మత్తుమందుల ప్రభావం కూడా పెరుగుతోంది. నా పర్వతారోహణ పట్ల ఉన్న ఆసక్తిని ఈ సామాజిక సందేశంతో మిళితం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను” […]

అమెరికాలో పడవ ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్

అమెరికాలోని శాన్ డియాగో తీరంలో పడవ ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున టోరీ పైన్స్ స్టేట్ బీచ్ సమీపంలో పడవ బోల్తా పడటంతో ముగ్గురు మరణించగా, ఓ భారతీయ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని కాన్సులేట్ Xలో వెల్లడించింది. కాగా, ఈ సంఘటనలో నలుగురు గాయపడినట్లు సమాచారం.

రామ్ చరణ్.. మైనపు విగ్రహావిష్కరణ

రామ్ చరణ్ తాజాగా లండన్‌కు బయల్దేరాడు. తన మైనపు విగ్రహావిష్కరణలో రామ్ చరణ్ సందడి చేయబోతోన్నాడు. గత ఏడాది మేడం టుస్సాడ్స్ టీం రామ్ చరణ్, రైమ్ ఇద్దరి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు, బన్నీ ఇలా అందరి మైనపు విగ్రహాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా ఉండబోతోంది. లండన్‌లో మే 9న ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోన్నట్టుగా తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఆర్థిక సహాయం అందనుంది. క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో టాప్‌-250 యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

షారుఖ్ ఖాన్ అరుదైన రికార్డ్, మెట్ గాలాలో ఫస్ట్ ఇండియన్ యాక్టర్

హాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలాలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన రెడ్ కార్పెట్ పై నడకకు ముందు, న్యూయార్క్ నగరంలోని మాండరిన్ ఓరియంటల్ హోటల్ బయట తన అభిమానులను కలిశారు. అభిమానులతో కరచాలనం చేస్తూ ముద్దులు పెడుతున్న కింగ్ ఖాన్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ […]

రవీంద్రనాథ్ ఠాగూర్

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి,  రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ లో జన్మించాడు రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో అభ్యసించేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON