loader

భారత రక్షణ వెబ్‌సైట్లపై పాకిస్థాన్ సైబర్ దాడి..

భారత రక్షణ రంగ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లను రంగంలోకి దింపింది. పాక్ హ్యాకర్లు సైబర్ దాడుల మళ్లీ ముమ్మరం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. భారత మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌ (MES), మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌ (MP-IDSA) సంస్థల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్టు ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యాకర్ల గ్రూప్ ప్రకటించింది.  దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.

నేటి అర్థరాత్రి నుంచి ఆర్‌టిసి సమ్మె

తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు సన్నద్దమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నారు. దీంతో మే 7వ తేదీ నుండి రాష్ట్రంలో బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే అశ్వథ్థామ రెడ్డి నేతృత్వంలోని ఆర్‌టిసి జెఎసి సమ్మెకు దూరంగా ఉంది. దీంతో ఆర్‌టిసి సంఘాలు రెండు జెఎసీలుగా చీలి పోయాయి. వెంకన్న నేతృత్వంలోని ఆర్‌టిసి జెఎసి సమ్మె నోటీసు ఇచ్చి 7 నుండి సమ్మెకు వెళుతుండగా అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని జెఎసి సమ్మెకు […]

ఏపీలో చదువుకునే అమ్మాయిలకు కొత్త పథకం.. ‘కలలకు రెక్కలు’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థినుల కోసం కొత్త పథకం తీసుకురాబోతోంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నత విద్య చదివే విద్యార్థినుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం పేరు ‘కలలకు రెక్కలు’గా నిర్ణయించారు. అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెంచాలని లెక్చరర్ల కొరతను తీర్చాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తామని చెప్పారు.

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో తెలంగాణ కోటా కట్‌.. విద్యార్థుల ఆశలపై నీళ్లు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో సైనిక్‌ స్కూల్‌లో హోం స్టేట్‌ స్టేటస్‌ కింద తెలంగాణ, ఏపీ విద్యార్థులకు 67% సీట్లున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏండ్లు పూర్తికావడంతో తెలంగాణకు గల హోం స్టేట్‌ హోదాను ఉపసంహరించారు. తెలంగాణ విద్యార్థులు ఆలిండియా కోటాలో33శాతం కోటా సీట్లకు పోటీపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో కొత్త సైనిక్‌ స్కూల్‌ ప్రారంభించే వరకు తెలంగాణ హోం స్టేట్‌ హోదాను పునరుద్ధరించాలని విద్యాశాఖ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది.

అడ్డదారిలో భారత్‌ మార్కెట్లోకి పాక్‌!.. అప్రమత్తమైన కస్టమ్స్‌ అధికారులు

పహల్గాం దాడి తర్వాత పాక్‌ నుంచి వచ్చే దిగుమతులు అన్నింటిపైనా భారత్‌ నిషేధం విధించిన తన వస్తువులను మన మార్కెట్లో విక్రయించేందుకు మరో దేశం మీదుగా వాటిని భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. యూఏఈ, సింగపూర్‌, ఇండోనేషియా, శ్రీలంక మీదుగా వాటిని భారత్‌లోకి పంపించాలని వ్యూహాలు పన్నుతున్నది. 500 మిలియన్‌ డాలర్ల విలువైన పాకిస్థానీ పండ్లు, ఎండు ఖర్జూరాలు, టెక్స్‌టైల్స్‌, రాతి ఉప్పు, తోలు వస్తువులు తదితర ఉత్పత్తులను ఇతర దేశాల్లో లేబుల్స్‌ మార్చి, రీ-ప్యాకేజ్‌ చేస్తున్నట్టు సమాచారం […]

మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్థాన్ సిద్ధం..

పాకిస్థాన్ కు చైనా సరఫరా చేసిన ఆయుధాల లిస్టులో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్. ఇలాంటివి ప్రస్తుతం పాక్ వద్ద 140 వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికాతో డీల్ క్యాన్సెల్ తర్వాత చైనా వీటిని సరఫరా చేసింది. ఆ తర్వాత జే-10 సీఈ ఫైటర్ జెట్.. ఇది 4.5 మల్టీ జనరేషన్ ఫైటర్ జెట్. 2022లో పాకిస్థాన్ చైనా నుంచి 36 జే-10 సీఈ ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకుంది.

ఆర్‌టిసిలో సమ్మె నిషేధం.. చట్ట వ్యతిరేకం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, సమ్మె యోచనను విరమించుకోవాలని ఆర్‌టిసి యాజమాన్యం సూచించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్‌టిసిలో సమ్మెలు నిషేధమని, సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమని పేర్కొంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీకుంటామని యాజమాన్యం హెచ్చరించింది.

మిస్టర్ చీప్ మినిస్టర్… తెలంగాణ కాదు..కాంగ్రెస్ దివాలా తీసింది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రం దివాలా తీయలేదు మిస్టర్ ‘చీప్ మినిస్టర్’ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే అంటూ ఘాటుగా విమర్శించారు.

సినిమా ఇండ‌స్ట్రీపై ప‌డ్డ ట్రంప్‌.. వారిపై 100 శాతం టారిఫ్

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా “విదేశాల్లో నిర్మించిన” అన్ని సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ చిత్రాల ప్రవాహాన్ని ఇతర దేశాల కుట్ర గా అభివర్ణించిన ట్రంప్ దీన్ని జాతీయ భద్రతా ముప్పు గా పేర్కొన్నారు. ఈ విదేశీ ప్రోత్సాహకాలు అమెరికా సినిమా పరిశ్రమను వేగంగా క్షీణింపజేస్తున్నాయని, గణనీయమైన ఆర్థిక నష్టాలకు కారణమవుతున్నాయని, దేశీయ చిత్రనిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయని వాదించారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉచితంగా పెళ్లిళ్లు…

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆర్థికంగా వెనకబడిన పేద హిందువులకు ఉచితంగా వివాహాలు చేస్తోంది. వధూవరులు చట్టబద్దంగా పెళ్ళి చేసుకునే వయసు కలిగివుండాలి. అంటే అమ్మాయి 18 ఏళ్లు, అబ్బాయి 21 ఏళ్లు పైబడి వయసు కలిగివుండాలి. ప్రేమ వివాహాలు, రెండో పెళ్లిళ్లు చేసుకునేవారికి తిరుమలలో అవకాశం ఉండదు. వధూవరుల తల్లిదండ్రులు తప్పకుండా పెళ్లికి హాజరుకావాల్సి ఉంటుంది. టిటిడి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో అబ్బాయి, అమ్మాయి తో పాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి. అందరి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON