విజయ్ దేవరకొండ సినిమాని AI తో వర్క్ చేయిస్తున్నాం: దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లార్వెన్ ఏఐ’ పేరుతో సరికొత్త స్టూడియోను ప్రారంభించారు. శనివారం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ స్టూడియోని లాంచ్ చేసారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమా పనులను ఏఐ స్టూడియోలోనే చేస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు.