తిరుమల, తిరుపతిలో క్యూ ఆర్ కోడ్ల ఏర్పాటు.
తిరుమల, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసింది. భక్తులు తమ మొబైల్ ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే, వాట్సాప్‌లో అభిప్రాయం పంపే ప్రత్యేక పేజీ తెరుచుకుంటుంది. అక్కడ భక్తులు ముందుగా తమ పేరు, సేవ విభాగాన్ని (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శనం, క్యూలైన్, గదులు మొదలైనవి) ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయాన్ని టెక్స్ట్ లేదా వీడియో రూపంలో పంపే సౌకర్యం ఉంటుంది.