loader

ప్లీజ్ అలా చేయకండి.. వారికి విజయ్ దళపతి రిక్వెస్ట్..

హీరో విజయ్ దళపతి జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లేందుకు మధురై చేరుకున్న విజయ్ కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. “నా కారును ఎవరూ వెంబడించకండి. బైక్‌లపై వేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కార్యకలాపాలకు అభిమానులు పాల్పడవద్దు ” అంటూ రిక్వెస్ట్ చేశారు విజయ్. విజయ్ వేడుకున్నప్పటికీ అభిమానులు పట్టించుకోకుండా ఆయన వాహనాన్ని అనుసరించారు. అంతేకాకుండా విజయ్ వాహనంపైకి ఎక్కడానికి పలువురు ఫ్యాన్స్ ట్రై చేయగా.. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు మరింత […]

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం తెద్దాం.. ముఖేష్ అంబానీ

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో  వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ పాల్గొన్నారు. “నెక్ట్స్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం భారత్‌లో వచ్చేలా చేద్దాం” అనే థీమ్‌తో కీలక ప్రసంగం చేశారు. ఇది భారతదేశ సాంస్కృతిక, క్రియేటివిటీ, టెక్నాలజీ శక్తిని ప్రదర్శించే అంతర్జాతీయ వేదికగా రూపొందింది. భారతదేశం గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నాయకత్వం వహించగలదని, “ఇది సాఫ్ట్ పవర్ కాదు, రియల్ పవర్” ముకేష్ […]

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 ఏప్రిల్ నెలలో రూ.3,354 కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇది 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాతి కాలంలో ఏపీలో నమోదైన అత్యధిక వసూళ్లుగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రం కూడా జీఎస్టీ వసూళ్లలో మంచి ప్రగతిని చూపింది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 12శాతం వృద్ధి నమోదు, చేసి మొత్తం రూ.6,983 కోట్ల ఆదాయాన్ని […]

అత్తమ్మాస్ కిచెన్‌లో మరో స్పెషల్ .. ఆవకాయ పచ్చడి

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గతేడాది తన కోడలు, ఉపాసన కొణిదెలతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌ను మొదలు పెట్టారు. ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారీ అత్తా కోడళ్లు. అత్తమ్మాస్ కిచెన్‌లోకి ఆవకాయ చేరుస్తున్నట్లు,  ఉపాసనకు బొట్టు పెట్టి సురేఖ గారు ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ […]

కాదు మీది రాంగ్ మోడల్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రోల్ మోడల్ కాదని, రాంగ్ మోడల్ అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. ఎడ్లబండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఊసే ఎత్తలేదని, ఇప్పుడు దానిపై రాజకీయ లబ్ధి […]

తెలంగాణే రోల్ మోడల్

కేంద్రం కులగణన చేస్తే తెలంగాణ మోడల్‌ను పరిగణలో కి తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్రాని కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేంద్రానికి సిఎం రేవంత్ రెడ్డి సూచించా రు.కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని

పబ్లిక్‌లో వద్దేవద్దు

విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో లభించే ఉచిత వై-ఫైకి చాలామంది బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి సర్వీసులను ఆచితూచి వాడుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్‌ వై-ఫై ఉపయోగించడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడుతుందని ఫ్రీ వై-ఫై నెట్‌వర్క్‌లో కనెక్ట్‌ అయినప్పడు బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటి ఆర్థిక లావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయవద్దని సలహా ఇస్తున్నారు. పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌కు సరైన భద్రత ఉండదనీ, ఇవి హ్యాకర్లు, స్కామర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయనీ […]

స్కైప్‌ సేవలకు మైక్రోసాఫ్ట్‌ స్వస్తి

ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన వీడియో-కాలింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్కైప్‌ మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్‌ అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్‌ తాజాగా వెల్లడించింది. స్కైప్‌ తన వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. అప్పట్నుంచీ దాదాపు 2 దశాబ్దాలుగా పాపులర్‌ ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దీనిని 2011లో మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. తమ యూజర్ల కమ్యునికేషన్‌ టూల్స్‌ అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ‘స్కైప్‌’కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపింది.

హైదరాబాద్‌లో ప్రపంచ అతిపెద్ద మహిళా AI హ్యాకథాన్

SAWiT (South Asian Women in Tech) ఓ భారీ Hackathon ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా  జరిగిన ఈ హ్యాకథాన్‌లో 3,93,071 మంది పాల్గొన్నారు. ఫైనల్ రౌండ్‌ హైదరాబాద్‌లోని T-hubలో జరిగింది. ఈ ఈవెంట్ జనరేటివ్‌ AIలో ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా ఈవెంట్. దేశవ్యాప్తంగా ఫైనల్‌కు వచ్చిన 25టీమ్‌లులు వారి వారి స్థానిక భాషల్లోనే తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. మహిళలను వారి సొంత భాషలోనే టెక్ ప్రాజెక్టులను చేసేలా ప్రోత్సహించడం ద్వారా SAWiT  సరైన ప్రాతిధ్యం దక్కని […]

సమ్మె వద్దు.. ఆర్థిక పరిస్థితి బాలేదు.. సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో మే డే వేడుకల్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని.. దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)    ఉద్యోగులు మొండి పట్టుదలకు పోకుండా.. సమ్మె ఆలోచనను విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల ఫలితంగా ఆర్టీసీ క్రమంగా లాభాల దిశగా పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON