loader

తిరుమ‌ల‌, తిరుప‌తిలో క్యూ ఆర్ కోడ్‌ల ఏర్పాటు.

తిరుమల, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసింది. భక్తులు తమ మొబైల్ ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే, వాట్సాప్‌లో అభిప్రాయం పంపే ప్రత్యేక పేజీ తెరుచుకుంటుంది. అక్కడ భక్తులు ముందుగా తమ పేరు, సేవ విభాగాన్ని (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శనం, క్యూలైన్, గదులు మొదలైనవి) ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయాన్ని టెక్స్ట్ లేదా వీడియో రూపంలో పంపే సౌకర్యం ఉంటుంది.

ఒంగోలు వీరయ్య చౌదరి హత్యకేసులో మరో ట్విస్ట్!

ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితలుకు సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. ముప్పవరపు వీరయ్య చౌదరికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఒంగోలుకు చెందిన యువకుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరయ్యచౌదరి హత్యకేసులో ఒంగోలుకు చెందిన యువకుడు ఎందుకు భాగస్వామి అయ్యాడనే చర్చ సాగుతోంది.

యుద్ధ సన్నహాలు

అరేబియా మహాసముద్రం వేదికగా భారత్ , పాకిస్థాన్ మధ్య శుక్రవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారతదేశపు అత్యంత కీలకమైన ఎకనామిక్ జోన్ (ఇఇజడ్) సముద్ర జలాల్లో పెద్ద ఎత్తు న విన్యాసాలు సాగించారు. ఇటీవలి కాలంలో భారతీయ నౌకాదళం విశేషరీతిలో తమ పోరాట పటిమను పెంచుకునేలా ఆయుధాలను, అత్యంత అధునాతన నౌకలను వార్‌హెడ్స్‌ను, జలాంతర్గాములను, విమానాలను సంతరించుకుంది. ప్రత్యేకించి గుజరాత్ తీర ప్రాంతానికి సమీపంలో భారతీయ తీరప్రాంత దళాలు సర్వం సమాయత్తం అయ్యాయి. ముఖ్యంగా ఫార్వర్డ్ ఏరియాలలో […]

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (ప్రపంచ పత్రికా దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీవరకు ఆఫ్రికాలోని నమీబియా లో ఆఫ్రికన్‌ జర్నలిస్టుల నిరసన గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని […]

భూభారతికి త్వరలో సాఫ్ట్‌వేర్

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను తన దగ్గర పెట్టుకొని కెసిఆర్ సర్వనాశనం చేశారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్ఛగా సమీక్ష చేసుకునే పరిస్థితి ఉండేది కాదని ఆ యన గుర్తుచేశారు.  భూ భారతిలో కొత్త సాఫ్ట్‌వేర్ రాబోతోందని ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరగదని, జరగనివ్వనని ఆయన హామీ ఇచ్చారు. జూన్‌లో సర్వే మ్యాప్ ఫైలెట్ ప్రాజెక్టు ద్వారా రిజిస్ట్రేషన్లు […]

పాక్‌ గగనతలంపై ఎగరని యూరప్‌ విమానాలు..

పాకిస్థాన్‌ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా పశ్చిమ దేశాలకు ప్రయాణించేందుకు దూరం పెరిగి ఖర్చులు ఎక్కువై నష్టపోతున్నది కేవలం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే కాదు..అనేక దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌లు కూడా. తమపై నిషేధం లేనప్పటికీ అవి పాక్‌ గగనతలాన్ని స్వచ్ఛందంగా దూరం పెట్టడం గమనార్హం. ఎయిర్‌లైన్స్‌ల నుంచి ఓవర్‌ఫ్లైట్‌ ఫీజుల పేరిట ప్రతి నెలా లక్షల డాలర్లు వసూలు చేస్తున్న పాకిస్థాన్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఇప్పుడా ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

డీమ్డ్‌ వర్సిటీలపై సెక్షన్‌20 ఎడ్యుకేషన్‌ యాక్ట్‌

రాష్ట్రంలోని డీమ్డ్‌ వర్సిటీలపై ‘సెక్షన్‌ 20 ఎడ్యుకేషన్‌ యాక్ట్‌’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్‌ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. యూజీసీ ఇష్టారీతిన పలు వర్సిటీలకు ప్రైవేట్‌, డీమ్డ్‌ హోదాను కల్పిస్తున్నది. ఈ వర్సిటీలపై మొదటినుంచీ సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇటీవలే ఇదే అంశం హైకోర్టుకు కూడా చేరింది. అయితే కోర్టు తుది ఉత్తర్వులివ్వలేదు. ఇటీవలే హైకోర్టు అటు డీమ్డ్‌ వర్సిటీలు, ఇటు ప్రభుత్వాన్ని జూన్‌లోపు అఫిడవిట్లు ఫైల్‌ […]

నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా

తెల్లటి టీషర్టుపై .. పోలీస్ రికార్డుల్లో ఉండే ఫొటోలు ఉన్నాయి. వాటి కింద ‘ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అని అక్షరాలు కూడా ఉన్నాయి. కాస్ట్‌లీ బ్రాండ్ల టీషర్టులు వాడి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే కొత్త ట్రై చేశారు. అది కాస్తా ట్రెండ్‌గా మారబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ టీషర్టు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుకు షాక్..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు హైకోర్టు షాకిచ్చింది. అరెస్ట్ కాకుండా ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ న్యాయస్థానం కొట్టేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావు ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నాడు. అనారోగ్యం నేపథ్యంలో తాను ఇండియాకు రాలేనని.. తాను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాని ప్రభాకర్ పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

నగరంలో పర్యటించనున్న అందాలభామలు

ప్రపంచ సుందరి పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్‌లో పోలీసులు భద్రను కట్టుదిట్టం చేశారు. ప్రపంచ సుందరీలతో నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా చార్మినార్, గోల్కొండ సుందరీమణులు సందర్శించనున్నారు. నగరంలోని రామోజీ ఫిలీ సిటీ, ఆస్పత్రులు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్‌ను సందర్శించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON