loader

కెనడాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థిని మృతి

కెనడాలో నాలుగు రోజుల కిందట అదృశ్యమైన భారతీయ విద్యార్థిని వన్షిక కథ విషాదంగా ముగిసింది. ఆమె అనుమానాస్పదంగా మృతిచెందినట్టు ఒట్టావాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. వన్షిక మృతికి కారణాలపై స్థానిక పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. పంజాబ్‌లోని డేరా బస్సి ప్రాంతానికి చెందిన వంశిక… ఆమ్ ఆద్మి పార్టీ నేత, ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ రంధావా అనుచరుడు దేవేందర్ సింగ్ కుమార్తె. వన్షిక మృతదేహాన్ని ఓ బీచ్ వద్ద కనుగొన్నారు. మృతికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు […]

తెలంగాణకు చివరి విలన్ కెసిఆర్. . .పిసిసి చీ ఫ్ మహేశ్ కుమార్ గౌడ్

పిసిసి చీ ఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతు ఆదివారం జరిగిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కెసిఆర్‌అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ బిక్షతో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కెసిఆర్‌కు గుండెల్లో గుబులు మొదలయ్యిందన్నారు. మీ పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు.

ఇతిహాసాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. టీడీపీ ప్రతినిధిపై వేటు

శ్రీమతి సందిరెడ్డి గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఓ ట్విట్టర్ స్పేస్ చర్చలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన అంశం ఇది. ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా మహిళా స్టేట్ కోఆర్డినేటర్ గాయత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పలువురు నెటిజన్లు ఆమె వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ […]

బాధితులకు అండగా జాతీయ మహిళా కమిషన్‌

గృహ హింస, లైంగిక, లైంగిక వేధింపులు, సైబర్‌ క్రైమ్‌ బాధిత మహిళలకు జాతీయ మహిళా కమిషన్‌ అండగా నిలుస్తుందని చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ అన్నారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా సమగం హాల్‌ లో ఏర్పాటు చేసిన మహిళా జన్‌ సున్వాయి( బహిరంగ విచారణ)లో ఆమె పాల్గొని కేసులు పరిష్కరించారు. హైదరాబాద్‌ లో కమిషన్‌ మొదటగా ఏర్పాటు చేసి మహిళా బాధితుల నుంచి 60 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. మహిళల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కమిషన్‌ నేరుగా […]

మరిన్ని పోరాటలకు సిద్ధం

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై, కెసిఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని కొనియాడారు. సభ ద్వారా భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ స్వయంగా తానే ముందుండి పోరాడతాను అని ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అభద్రతాభావంతోనే కెసిఆర్ అక్కసు

తాను సిఎం అయిన రెండో రోజే కెసిఆర్ గుండె పగిలిపోయిందని ఆయన ఆరోపించారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కెసిఆర్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కెసిఆర్ అని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని ఆయన విమర్శించారు. కెసిఆర్ అభద్రతా భావంలో కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కారని సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదన్నారు.

రైతులతో సీఎం చంద్రబాబు భేటీ: అమరావతి పునఃప్రారంభానికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం కార్యక్రమానికి రైతులను స్వయంగా ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.మే 2వ తేదీని రాష్ట్ర చరిత్రలో మలుపు తిప్పే రోజు అవుతుందని అన్నారు. అమరావతి పునఃప్రారంభం పనులు జరుగనున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకాబోతున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు, సమస్యలపై చర్చించారు. రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా […]

పోలీసు అధికారితో సిద్ధరామయ్య దురుసు ప్రవర్తన

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయి ఒక పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారు. బెళగావి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రసంగించడానికి ముందే బీజేపీ మహిళా మోర్చా సభ్యులు నల్ల జెండాలతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కారణంగా, ప్రసంగానికి అడ్డంకి ఏర్పడింది. సభా బాధ్యతలు చూస్తున్న పోలీసు అధికారి, ASP భరమణిని పిలిచి దురుసుగా ప్రవర్తించారు. సిద్ధరామయ్య తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక, చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ […]

మన బుర్రకథకు గౌరవం.. మిరియాల అప్పారావుకు పద్మశ్రీ పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారం మరణానంతరంగా ప్రదానం చేశారు. సంప్రదాయ బుర్రకథ కళను పరిరక్షించడంలో, ప్రాచుర్యంలో ఆయన చేసిన విశేషమైన కృషికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ గౌరవాన్ని అందించారు.

పద్మ భూషణ్ అందుకున్న బాలకృష్ణ.. ఫ్యామిలీతో పాటు ఫోటోలు వైరల్

నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఈ గౌరవం ఆయన సినీ రంగంలో చేసిన విశిష్ట కృషి..ఆయన చేసిన ఎన్నో ప్రజాసేవలను గుర్తించి మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలకృష్ణకు..అందజేశారు. బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును స్వీకరించడంతో.. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు, రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు బాలకృష్ణను అభినందించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON