loader

హైద‌రాబాద్ అమ్మాయి.. పాకిస్థానీ కుర్రాడు

పాకిస్థాన్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మొహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి నిబంధనల ప్రకారం భారత్‌లోకి ప్రవేశించకుండా, పాకిస్తాన్ నుంచి నెపాల్ మీదుగా భారత్‌కు వచ్చాడు. హైదరాబాద్‌కు చేరి, అక్కడి యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడు తన విదేశీ పౌరసత్వాన్ని అధికారులకు తెలపకుండా ఇదంతా చేయ‌డం నేరంగా మారింది. వివ‌రాలు తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, గత చరిత్ర, ప్రయాణ వివరాలు, వలస నిబంధనలు, పెళ్లి చట్టబద్ధత […]

2.5 లక్షల మంది స‌మ‌క్షంలో పోప్‌కు వీడ్కోలు..

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు వెటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గౌరవప్రదంగా జరిగాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అంత్యక్రియల్లో 130 విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో 50 మంది దేశాధినేతలు, 10 మంది రాజులు ఉన్నారు. వీరితో పాటు 2.5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.  పోప్ ఫ్రాన్సిస్ తన కోరిక మేరకు సాంప్రదాయ మూడు  పేటికలకు బదులుగా చెక్క పేటికను ఉపయోగించారు. రోమ్‌లోని సాంతా మారియా మాగ్గియోరీ బాసిలికాలో సమాధి అయ్యారు.

ఈడీ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం: కీలక ఫైళ్లు స్వాహా

ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారు జామున రెండుసార్లు ఈ భవనంలో మంటలు చెలరేగాయి. పలు కీలక ఫైళ్లు మంటలకు అహూతి అయ్యాయి. ముంబై బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని కరీం భాయ్ రోడ్‌లో గల ఖైసర్-ఐ-హింద్ బిల్డింగ్‌లో ఉందీ ఈడీ కార్యాలయం. అగ్నిప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లెవెల్ 2గా ప్రకటించారు. అదనపు సిబ్బందిని పిలిపించి, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.

సంస్కృతాన్ని ప్రవేశపెట్టడమంటే..

సర్కారు కాలేజీల్లో రెండోభాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడమంటే తెలంగాణలో తెలుగును హత్యచేయడమేనని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఇంటర్‌బోర్డు సమీక్షించాలని ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకరశర్మ, ప్రొఫెసర్‌ కాశీం, డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ రఘు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వితీయ భాష నిర్ణయం బోర్డు స్వతంత్రంగా తీసుకున్నదా..? ప్రభుత్వ పాలసీయా? అన్నది స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారుమన ప్రాంతంలో తెలుగులో మనమే శిక్షణ ఇవ్వకపోతే ఇతర ప్రాంతాల్లో అవకాశాలు అసలే ఉండవని వాపోయారు.

భారత్-పాక్ యుద్ధం వస్తుందా ? ఐరాస అంచనా ఇదే..!

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితిపై సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందిస్తూ తాము దీని పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దాడులను ఖండిస్తున్నామని, పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవడానికి గరిష్ట సంయమనం పాటించాలని భారత్, […]

మన సర్వం AI వచ్చేస్తోంది.. ఇక దూసుకెళ్లడమే

భారతీయ భాషలలో తార్కికతకు మద్దతు ఇచ్చే భారతదేశ ప్రాథమిక AI మోడల్ ఆరు నెలల్లో సిద్ధంగా ఉంటుందని సర్వం AI వ్యవస్థాపకులు వివేక్ రాఘవన్ చెప్పారు. అది తాము నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యమని(టైం లైన్) రాఘవన్ తెలిపారు. “వాస్తవానికి మేము భారతీయ భాషలలో(Indic languages) తార్కికతను నిర్మిస్తున్నాము” అని రాఘవన్ వెల్లడించారు. “కాబట్టి, మీరు ఏ భాషలోనైనా, ఏ లిపిలోనైనా ప్రశ్నలు అడగవచ్చు, అది దేవనాగరి లేదా రోమన్ లిపి హింద్ అయినా, మన మోడల్ ప్రతిస్పందిస్తుంది.” […]

ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం

గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ రోజు రానే వచ్చింది. గులాబీ జెండాను భుజానకెత్తుకొని కార్యకర్తలు, నాయకులంతా ఎల్కతుర్తి సభకు బయల్దేరి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఇవాళ ఆవిర్భావ సభ జరగనుంది. గత నెల రోజులుగా గులాబీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఆ పార్టీ నాయకులు సభకు తరలి రావాలని ఆహ్వానించారు. ఈ సభకు లక్షల్లో ప్రజలు […]

భారత్-పాక్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ ఆఫర్-సౌదీతో కేంద్రం చర్చలు..!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా పతనం అయ్యాయి. పశ్చిమాసియాలోని భారత్ మిత్ర దేశం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ లో పోస్టు చేశారు. భారత్-పాకిస్తాన్మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరిక సంబంధాలు ఉన్నాయని తాము కూడా వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా మధ్యవర్తిత్వానికి […]

అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌..

విజయ్ దేవర కొండ తన రౌడీ బ్రాండ్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సందర్భంగా మరోసారి రౌడీ వేర్స్‌ను అల్లు అర్జున్ కు పంపించాడు విజయ్. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విజయ్ తనకు పంపిన గిఫ్ట్స్ ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన బన్నీ.. ‘మై స్వీట్‌ బ్రదర్‌.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్‌ చేస్తుంటావు. సో స్వీట్‌’ అని విజయ్ పై ప్రేమను కురిపించాడు బన్నీ. […]

మెట్రోలో బెట్టింగ్ యాప్ యాడ్.. ఎండీకి నోటీసులు

హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా.. బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాడ్‌లను ప్రమోట్ చేసిన వారికి నోటీసులు పంపించి పోలీసులు విచారించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON