loader

అవి బీర్లా.. మంచి నీళ్లా.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..

తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయి. ఇది సాధారణ రోజుల కంటే రెట్టింపు. బీర్ల అమ్మకాలకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకమైనవి కావడంతో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా వీటి అమ్మకాలపైనే దృష్టి సారించింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా బీర్ల అమ్మకాలకు మరింత ఊతమిస్తున్నాయి. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత కనిపిస్తున్నారు. మ్యాచ్ చూస్తూ బీర్ తాగడానికి ఎక్కువ మంది […]

మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త వివాదానికి తెర తీశారు. ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్ట్  ప్రధాని మోదీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి. కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన YS షర్మిల అనంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, భద్రతా లోపాల వల్లనే ఇంత పెద్ద మారణకాండ జరిగిందని YS షర్మిల రెడ్డి అన్నారు. ఉగ్రవాదులు […]

పహల్గాం ఉగ్రదాడితో ఉద్రిక్తత.. ఎయిరిండియా, ఇండిగో కీలక ప్రకటన!

కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిన క్రమంలో భారత్, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థానం తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. దీంతోప్రయాణ సమయం పెరుగుతుందని ప్రయాణికులకు సూచించింది. టికెట్ ధర కూడా ఆ మేర పెరిగి అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గగనతలం మూసివేత మా చేతిలో లేని వ్యవహారాం. అయితే, ఎయిరిండియా ప్రయాణికులు సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం. అని ఎయిరిండియా సోషల్ మీడియా […]

భావాలన్నీ మన భాషలోనే..

ఆధునిక సాంకేతికత.. మనుషుల మధ్య అంతరాలను తగ్గిస్తున్నది. దేశాల హద్దులను చెరిపేస్తూ.. ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తున్నది.  యాప్‌ వాట్సాప్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అన్ని భాషలనూ మాతృభాషలోకి మార్చేసే ‘మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌’ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే చాట్‌ మెసేజ్‌లను అనువాదం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇతర దేశాల్లో పర్యటించేటప్పుడు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ‘ఆండ్రాయిడ్‌’లో నాలుగైదు నెలల నుంచే అందుబాటులో ఉన్న ఈ ‘మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌’.. త్వరలోనే ఐఓఎస్‌ వినియోగదారులకూ చేరువకానున్నది.

గొర్రెల కాపరికి సివిల్స్ ర్యాంక్.. సిద్ధప్ప.. మీరు గ్రేట్

గొర్రెల కాపరి సివిల్స్‌లో మెరిశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధిలోని అమగె గ్రామానికి చెందిన బిర్ దేవ్ సిద్ధప్ప డోని ది గొర్రెలు కాచుకునే కుటుంబం. అతను కొండలలో గొర్రెలను మేపుతూ పెరిగాడు. సరైన ఇల్లు కూడా లేదు. వెలుగు ఉన్నప్పుడే చెట్ల కింద కూర్చొని చదువుకునే వాడు. ఇన్ని కష్టాలున్నా అతడు చదువుల్లో ఎక్కడా వెనుకబడలేదు. 10వ తరగతిలో, 12వ తరగతిలో మంచి మార్కులు సాధించాడు. ఇంజినీరింగ్ చేశాడు.యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్‌లో 551వ ర్యాంకు సాధించాడు.

పాక్‌కు వత్తాసు పలికిన ఎమ్మెల్యే అరెస్ట్.. దేశద్రోహం కేసు నమోదు!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన హృదయవిదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘాతుక చర్య వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా విశ్వసిస్తున్న వేళ, దాయాది దేశాన్ని వెనకేసుకొచ్చారనే తీవ్ర ఆరోపణలపై అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆ దేశ ప్రమేయాన్ని సదరు ఎమ్మెల్యే సమర్థిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. ఇది క్షమించరాని నేరం అని సీఎం […]

ఆ ఇద్దరూ పాక్ జాతీయులే

పహల్గామ్ ఉగ్రదాడులలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు పాకిస్థానీ జాతీయులు అని భద్రతా బలగాలు ప్రాధమికంగా గుర్తించాయి. ఉగ్రవాదుల నమూనా రూపాలను తెలిపే స్కెచ్‌లను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక్కరోజు క్రితమే విడుదల చేశాయి. ఆచూకిని తెలిపే సమాచారం అందించిన వారికి రూ 20 లక్షల రివార్డును ప్రకటించారు. ఇద్దరిలో ఒక్కరు హషీం మూసా అలియాస్ సులేమాన్ మరొక్కడు అలీ భట్ అలియాస్ తహా భట్ అని అధికారులు తెలిపారు. ఇక మూడో టెర్రరిస్టు భారతీయ పౌరుడు  […]

ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతు

దాడుల విషయంలో భద్రతా బలగాలు నిర్లిప్తత , ఇంటలిజెన్స వర్గాల పర్యవేక్షణా లోపాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలోనే గురువారం అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి టెర్రర్ క్యాంప్‌లను ఏరివేయాలని సమావేశంలో పార్టీలకు అతీతంగా నేతలు అంతా పిలుపు నిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తప్పనిసరి, ఉదాసీనత పనికిరాదని వివరించారు. తామంతా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతిపక్షాలన్ని కూడా పహల్గామ్ దాడులను ఖండిస్తున్నాయి.

కశ్మీర్‌కు వెళ్లవద్దు ..బాధితులు కావద్దు

జమ్మూ కశ్మీర్‌లో హింసాత్మక అశాంతి, అరాచకం నెలకొనే ముప్పు ఉందని అమెరికా హెచ్చరించింది. పహల్గామ్‌లో ఉగ్రదాడుల తరువాత అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. కశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఆకళింపు చేసుకున్న తరువాత ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికన్లు ఎవరూ ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించరాదు. ప్రత్యేకించి పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లరాదని సూచనలు వెలువరించారు.కశ్మీర్ లోయలోని పలు పర్యాటక కేంద్రాలు , శ్రీనగర్, గుల్మార్గ్ , పహల్గామ్ వంటి ప్రాంతాలలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అక్కడికి […]

అనుష్క మూవీ నుంచి కూడా డైరెక్టర్ క్రిష్ సైడయ్యారా ?

ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా డ్రగ్స్ కేసు వ్యవహారంలో సైలెంట్ అయిపోయిన ఆయన సినిమాలను కూడా సైలెంట్ గా తెరకెక్కిస్తున్నట్టు భావించారు. లేడి సూపర్ స్టార్ అనుష్కతో ‘ఘాటి’ మొద‌లుపెట్టాడు క్రిష్. అయితే ఈ మూవీ కూడా మధ్యలో ఆగిపోయిందా? లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ‘మణికర్ణిక’, హరిహర వీరమల్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON