loader

సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు ఊహించని నేత

సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు వెళ్లే దెవరు. ఏపీలో వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ కు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం బీజేపీ కోరటంతో టీడీపీ, జనసేన అంగీకరించాయి. బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులోకి వచ్చాయి. ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపు నిర్ణయించింది. అదే సమయంలో అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ […]

ఉగ్రదాడిపై ఖాన్స్ త్రయం సైలెన్స్..

దేశం మొత్తం జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తోంది. అటు ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా కూడా ఈ బాధాకరమైన సమయంలో భారత్ కు అండగా నిలిచాయి. అటు సినీ ప్రముఖులు, క్రికెటర్స్ అందరు ఈ ఉగ్రచర్యను ఖండించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోలు కనీసం ఈ ఘటనపై స్పందిచనూ లేదు. దేశం పై ఉగ్రదాడి జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో కనీసం స్పందించరా […]

పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న కీలక సూత్రదారి ఇతడే..!

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి.పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తోయిబా’ అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది.  ఉగ్రవాద కార్యకలాపాల వెనుక.. ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఈ దాడులకు అతనే […]

ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్ పోర్టులో అత్య‌వ‌సర స‌మావేశం,

ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న మ‌రికాసేప‌ట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం కానుంది. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇప్ప‌టికే శ్రీన‌గ‌ర్‌కు చేరుకుని, భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో […]

రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్,

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు మంగళవారం అర్ధరాత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ విధించిన అనంతరం నిందితుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని న్యాయమూర్తి ప్రశ్ననిందితుడు కాసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ శేఖర్ రెడ్డిని సిఐడి కోర్టులో హాజరు […]

‘పాడుతా తీయగా’పై నిరసన గళం

ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్‌ రియాల్టీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది.  ఈ కార్యక్రమానికి ప్రస్తుతం న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీత తనను తీవ్రంగా అవమానించారంటూ ఓ గాయని ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. న్యాయ నిర్ణేతలు తనను మానసికంగా హింసించారని, బాడీషేమింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా ప్రవస్తి ఆరోపణలను గాయని సునీత ఖండించారు. ఎవరు బాగా పాడినా ప్రోత్సహిస్తాం. పోటీదారులంతా నాకు […]

ఉచితంగా అవయవ మార్పిడి

పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల తరహాలో నిర్మించిన ఆరు థియేటర్లు నిర్మాణపు పనులు, 95శాతం పూర్తయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.అవయవాల మార్పిడికోసం ఆరు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థీయేటర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి మూడు వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. పీజీ విద్యార్థులకు వైద్యవిద్యలో భాగంగా ఆపరేషన్‌ థియేటర్‌లో నిర్వహించే అవయవ మార్పిడి చికిత్సను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేశారు. […]

బైబై చైనా.. ల్యాప్‌టాప్‌ కంపెనీలు ఇండియాకి క్యూ!

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ అంటే వెంటనే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచ దిగ్గజ కంపెనీల మాన్యఫాక్చరింగ్ కంపెనీల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి.  ఆ దిగ్గజ కంపెనీలు చైనాకు బదులుగా భారత దేశం బాట పడుతున్నాయి. మన దగ్గరే ల్యాప్‌టాప్‌ తయారీ యూనిట్లు తెరుస్తున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా చైనాలో తయారైన వస్తువులపై అత్యధిక పన్నుల భారం పడనుంది. దీన్ని ముందే గ్రహించిన కంపెనీలు నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ఫ్యాక్టరీలను తెరవడం ప్రారంభిస్తున్నాయి. భారతదేశాన్ని ‘సురక్షితమైన స్థావరం’గా భావిస్తున్నాయి.

ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చిరించారు. తన సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని భారత్ బయల్దేరారు. జెడ్డాలో సౌదీ అరేబియా నిర్వహించే అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలవాల్సి ఉంది. అన్నింటినీ రద్దు చేశారు. బాధితులకు సాధ్యమైన సహాయం […]

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ సంతాపం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ఖండించారు. ఈ పహల్గాం ఉగ్రదాడిపై జె.డి. వాన్స్ ఎక్స్ వేదికన రియాక్ట్ అయ్యారు. ”ఉషా, నేను పహల్గాంలో జరిగిన ఈ దారుణ ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాం” అని వాన్స్ పోస్ట్ చేశారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఒక్కసారిగా ఉగ్రవాదాలు కాల్పులకు తెగబడ్డారు. కేవలం హిందూ టూరిస్టులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు… దీంతో 27 మంది […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON