loader

ఢిల్లీలో టూర్ లో చంద్రబాబు .. రాజ్యసభ సీటు భర్తీపై చర్చ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తోంది.  అమిత్ షా తో భేటీ వేళ రాజకీయ చర్చకు కీలకంగా మారనున్నాయి.  ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధితో పాటు కేంద్ర మంత్రిగా అవకాశం ఎవరికి తుది […]

ఉద్యోగ భద్రత కల్పించండి

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్రవేశించి నిరసనలకు, సమ్మెకు అనుమతి లేదంటూ కాంట్రాక్ట్‌ అధ్యాపకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న అధ్యాపకులను విస్మరించి యూజీసీ పే స్కేల్‌ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదని అన్నారు.

రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలి

డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కొనకుండా ఉండేందుకు తెలంగాణలో ‘రోహిత్ వేముల’ చ ట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు కుల వివక్ష కారణంగా అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని, తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సిఎం రేవంత్ […]

నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం

నవ ప్రపంచాన్నినిర్మిద్దామని అందులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒసాకా ఎక్స్ పోలో ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్‌రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సిఎం బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లోకి అడుగుపెట్టింది. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ఎక్స్‌పోలో రాష్ట్రానికి సంబంధించి తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను సిఎం రేవం త్ ఈ సందర్భంగా ప్రారంభించారు.

ధరిత్రి దినోత్సవం

ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. 1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నాం. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం.

మోదీ-వాన్స్ భేటీ

ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ, భారత్-అమెరికా బంధం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా, అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. భారత్-అమెరికా మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇరు దేశాలకూ లాభదాయకమైన (“విన్-విన్”) ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఇరు పక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

ప్రపంచం 5G, చైనా మాత్రం 10G..

ప్రపంచంలో 5G నెట్ వర్క్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ పరిధి చెరిపివేసింది. ఎందుకంటే, 5జి నెట్ వర్క్ ఏకంగా 1 Gbps వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ ను అందిస్తుంది. 50G-PON ను ఉపయోగించి హువావే మరియు చైనా యూనికామ్ సంయుక్తంగా 10G బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. చైనా ఫ్యూచర్ స్మార్ట్ సిటీగా పేరొందిన శియోంగ్‌ఆన్ (Xiong’an) ప్రాంతంలో ఈ 10G సర్వీస్ ను మొదటిగా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

సముద్ర తీరాన డ్రాగన్.. ఎన్టీఆర్-నీల్ ఫోటో వైరల్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో  హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 22న సెట్స్ లోకి వస్తారని మేకర్స్ ప్రకటించారు. దీని కోసం ఆయన కర్ణాటకకు చేరుకున్నారు.  ఈ నేపథ్యంలో దర్శక హీరోలకు సంబంధించిన ఓ ఫోటోని చిత్ర […]

బెంగళూర్‌లో ఐఎఎఫ్ అధికారిపై దాడి

కన్నడలో మాట్లాడే వ్యక్తులు కొందరు బెంగళూరులో సోమవారం తెల్లవారుజామున ఓ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఎఎఫ్)ని బైక్‌పై వెంబడించి దుర్భాషలాడి, దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన భార్యతో కలిసి విమానాశ్రయానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన భార్య స్కాడ్రన్ లీడర్ మధుమితా దత్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైప్పనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ ద్విచక్రంపై తనను వెంటాడిన వక్తులు తనపై దుర్భాషలాడి, దాడిచేశారని ఆరోపించారు.

వైసీపీ బలోపేతంపై జగన్ ఫోకస్… ఈ రోజు పీఏసీ సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు…భవిష్యత్ కార్యచరణపై వైఎస్ జగన్ పీఏసీ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.  23న జిల్లాఅధ్యక్షులు, సోషల్‌ మీడియా ముఖ్యులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భవిష్యత్‌ కార్యచరణపై వైసీపీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON