loader

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌పై జమ్మూ కశ్మీర్ సీఎం ఆగ్రహం

ఢిల్లీ విమానాశ్రయంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఆయన ప్రయాణిస్తోన్న విమానాన్ని జైపూర్‌కు దారి మళ్లించడంపై మండిపడ్డారు. విమానం బయలుదేరిన మూడు గంటల అనంతరం దారి మళ్లించారని, ఢిల్లీ విమానాశ్రయం తీరు దారుణంగా ఉందని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. జైపూర్ నుంచి తిరిగి ఎప్పుడు బయల్దేరుతామో కూడా తెలియదని, దీని గురించి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దుయ్యబట్టారు.

కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారికి 3 శాతం రిజర్వేషన్లు, ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏకంగా 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖ వంటి యూనిఫాం సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు.

దారుణంగా హింసించారు : హర్షకుమార్‌

ప్రవీణ్‌ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, అయనది హత్యేనంటూ అమలాపురం లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్‌ పిలుపు మేరకు శనివారం సాయంత్రం వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్‌ మరణించిన స్థలానికి ర్యాలీగా చేరుకున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. హర్షకుమార్‌తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి హర్షకుమార్‌ను పోలీసులు విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ […]

20 ఏళ్ల తరువాత హిందీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌..

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది. 20 ఏళ్ల తరువాత ఏకమయ్యేందుకు ఠాక్రే బ్రదర్స్‌ ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాజ్‌ ఠాక్రే , ఇటు ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించారు. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తామని ఠాక్రే బ్రదర్స్‌ ప్రకటించారు. త్రిభాషా సిద్దాంతానికి తాము వ్యతిరేకమని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయడాన్ని తప్పుపట్టారు. రాజకీయ ప్రయోజనాల కంటే […]

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తులను ఆదివారం నుంచి (20-04-2025) ప్రారంభమయ్యాయి. మే 15 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. హాల్‌టికెట్లను మే 30 నుంచి జారీ చేస్తారు. డీఎస్సీ పరీక్షలను జూన్‌ ఆరు నుంచి జులై ఆరు వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు పూర్తి అయిన రెండోరోజున ప్రాథమిక కీ విడదల చేస్తారు. అభ్యంతరాలను ఏడు రోజుల్లో స్వీకరిస్తారు. అనంతరం తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల చేసిన ఏడు […]

బాలయ్యా మజాకా.. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇన్ని లక్షలా..?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం (ఏప్రిల్ 19న) జరిగిన ప్రత్యేక  వేలంలో సినీ నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమాన ‘0001’ నంబర్ కోసం రికార్డు ధర 7.75 లక్షలు వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అట్లుంటి మా బాలయ్యతో అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తుంటే.. కొంతమంది అయితే.. ఈ డబ్బుతో ఏకంగా కొత్త కారే కొనేయొచ్చు కదా భయ్యా.. అంటూ నెటిజన్లు మీమ్స్ […]

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందాల ద్వారా, రాబోయే 1-2 సంవత్సరాల్లో జపాన్‌లోని వివిధ రంగాల్లో 500 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ రంగంలో 100, ఆతిథ్య రంగంలో 100, నిర్మాణ […]

భారత్‌ తొలి ఏఐ సర్వర్‌ ఆవిష్కరణ.. అభివృద్ధి చేసిన వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం దేశపు తొలి ఏఐ సర్వర్‌ను ప్రదర్శించారు. మానేసర్‌లోని వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పార్క్‌లో ఆయన మాట్లాడుతూ… ఇందులో 8 జీపీయూలు ఉన్నాయన్నారు. అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధలో మన దేశం మంచి పురోగతి సాధిస్తున్నదని మంత్రి చెప్పారు. వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

స్మిత సబర్వాల్‌‌ను విచారించిన పోలీసులు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు స్మిత సబర్వాల్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేసినట్లు చెప్పారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని స్మితా […]

27న ‘మాడల్‌’ ప్రవేశ పరీక్ష..

తెలంగాణ మాడల్‌ స్కూల్స్‌లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు డైరెక్టర్‌ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 21న హాల్‌టికెట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. 27న ఉదయం 10-12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7-10 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు telanganamS.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON