కూటమి నేతలైనా ఉపేక్షించబోం.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి కబ్జాలు, దందాలపై అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు. పర్యటనలో భాగంగా ముందు కాకినాడ, విశాఖపట్నం వెళ్లాలని పవన్ నిర్ణయించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు కూటమి నేతల కారణంగా ఇబ్బందిపడ్డా ఉపేక్షించబోము అంటూ తమ ప్రభుత్వంలో పాలన పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగుతుందని.. ఎవర్నీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.