loader

పవన్ కల్యాణ్ గొప్ప మనసు… ఆ గ్రామంలోని ప్రజలకు పాదరక్షలు పంపిన డిప్యూటీ సీఎం…

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఓ గిరిజిన గ్రామంలోని ప్రజలందరికీ పాదరక్షలు పంపించారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఆ గ్రామంలోని గిరిజినులకు పాదరక్షలు కూడా లేవని గ్రహించిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు.దీంతో పవన్‌ కల్యాణ్‌కు గిరిజనులు […]

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

పాత మెలోడీ, క్లాసిక్ సాంగ్  ఆహా నా పెళ్లి అంట సాంగ్ మహానటి సావిత్రి హావభావాలు కళ్ళల్లో మెదులుతాయి. తాజాగా ఓ డాన్స్ షోలో ఐకానిక్ సాంగ్‌ను చెడగొట్టారని మండిపడుతున్నారు నెటిజన్స్. అలాంటి సాంగ్‌కు రీసెంట్‌గా ఓ డాన్స్ షోలో అసభ్యకరంగా స్టెప్పులేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. దాంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. అంతే కాదు ఆ డాన్స్ షోకు గెస్ట్‌గా వెళ్లిన టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ  డాన్స్ కొత్తగా […]

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదలకు డేట్స్ ఫిక్స్..

తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై నెల దర్శనం టికెట్ల కోటాను రేపటినుంచి (ఏప్రిల్ 19) విడుదల చేయనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తేదీలను ప్రకటించింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల‌ కోటాను ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

గ్రూప్‌-1 కు బ్రేక్‌.. నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల నియామకాలకు బ్రేక్‌ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగించేందుకు అనుమతిచ్చింది. గ్రూప్‌-1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ ఎం పరమేశ్‌ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు […]

జమ్మూ కశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. కాశ్మీర్ సోదరులను మేం వదిలేయమని, వాళ్లకోసం నిరంతరం పోరాడుతూ ఉంటామని అసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కి పెట్టుబడులు రాకపోవటానికి ఉగ్రవాద కార్యకలాపాలే కారణమన్నారు అసిమ్ మునీర్. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించలేరంటూ వ్యాఖ్యానించారు.

హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా షమీమ్‌అక్తర్‌ బాధ్యతలు

ెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా నియమితులైన జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌ గురువారం నాంపల్లిలోని టీజీహెచ్‌ఆర్సీలో బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌తోపాటు, కమిషన్‌ సభ్యులు జిల్లా రిటైర్డ్‌ న్యాయమూర్తి ప్రవీణ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ బీ కిశోర్‌ బాధ్యతలు స్వీకరించారు.

గుడ్ ఫ్రైడే

క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు. ఇది శిలువపై ఏసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు. ఆయన మనల్ని రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన రోజే ఇది. ఎంతో దుఃఖభరితమైనా.. అదే సమయంలో మనలో మనస్పూర్తిగా కృతజ్ఞత కలిగించే రోజు.

ఆస్ట్రేలియాలో ‘చలో వరంగల్‌ ’ పోస్టర్‌ ఆవిషరణ

బీఆర్‌ఎస్‌ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు సంబంధించిన ‘చలో వరంగల్‌’ పోస్టర్‌ను గురువారం ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలోని ఒపేరా హౌస్‌, హార్బర్‌ బ్రిడ్జి వద్ద పోస్టర్‌ ఆవిషరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకలో పాల్గొంటారని, అలాగే రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలోనూ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

పరిశ్రమలకు కూటమి నేతల వేధింపులు… బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో ‘కూటమి’ అవినీతికి పరిశ్రమలు విలవిలలాడుతున్నాయ. కూటమి అరాచకంతో పరిశ్రమల మనగడ ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది’ ఇప్పటికే జిందాల్‌ను రాష్ట్రం నుంచి సాగనంపారు. నేడు కడపజిల్లాలోని సిమెంట్ కర్మాగారాన్ని మూయించే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అంటే ఇదేనా చంద్రబాబూ?’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

స్మితా సబర్వాల్‌ మరో రీపోస్ట్‌

హెచ్‌సీయూ అంశంపై ఓ ట్వీట్‌ను రీపోస్టు చేసినందుకు గచ్చిబౌలి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణలోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో పెద్దఎత్తున చెట్ల నరికివేతకు సంబంధించిన కేసులో, కంచె గచ్చిబౌలిలో తక్షణం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. లేకపోతే అధికారులను జైలుకు పంపాల్సి ఉంటుంది’ అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ‘లైవ్‌ లా ఇండియా’ పోస్టును షేర్‌ చేసిన ఎక్స్‌ పోస్ట్‌ను స్మితాసబర్వాల్‌ తనఖాతాలో రీపోస్ట్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON