loader

కోనో కార్పస్‌ మొక్కలపై కేంద్రం కీలక నిర్ణయం..

కోనో కార్పస్‌ మొక్కలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొక్కలను కొత్తగా నాటకూడదని, ఉన్న వాటిని నరకవద్దని కేంద్రం ఆదేశించింది. ఆస్తమా వస్తుందనే అపోహలను నమ్మవద్దని, చెట్లు నరికితే చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే ఈ మొక్కలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రైల్వే జోన్ పై అనూహ్య ట్విస్ట్

విశాఖ రైల్వే జోన్ పైన ఇంకా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన తో జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుందని అందరూ భావించారు. అయితే, సాంకేతిక కారణాలతో పాటుగా ఒడిశా అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. కొత్తవలసను కూడా రాయగడ డివిజన్‌లో చేర్చాలని డిమాండ్‌ తెర మీదకు రావటంతో.. జోనల్‌ ఆఫీస్‌ పనులు మళ్లీ ఆగాయి. ఈ సమస్య ఏపీలోని కూటమి నేతలకు పరీక్షగా మారుతోంది. కేంద్ర నిర్ణయం […]

ఆందోళన కలిగించేలా ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్,

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఊహించని విధంగా ఎన్టీఆర్ బాగా సన్నగా మారిపోయారు. ముఖంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.  తారక్ బరువు తగ్గడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ? మెడిసిన్ వాడుతున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం ఎలాంటి మెడిసిన్ వాడడం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని టీం నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం […]

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు మొన్నటి వరకు వివిధ రకాల యాప్‌లతో పడుతున్న ఇబ్బందులను గమనించి కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ఒక సమగ్ర యాప్‌ను విడుదల చేశారు.  ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు అని తెలిపారు. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్‌బోర్డు అనే ఆరు విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

డీప్‌టెక్ వద్దు… స్టార్టప్‌ ముద్దు..

ఇండియాలో డీప్‌టెక్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సంజయ్‌ పేర్కొన్నాడు. దీనివల్ల దేశంలో స్టార్టప్‌ల సంఖ్య తగ్గుతుందని, ఆ రంగంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయన్నారు. అంతేకాకుండా… ఇప్పటికే ఏఐ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించి అభివృద్ది చేస్తున్నవారిపై డీప్‌టెక్‌ ప్రభావం ఉంటుందని నూతన స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోతారని ఆయన హెచ్చరించారు.

విమాన ఖర్చులు ఇస్తాం.. వెళ్లిపోండి

అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో అక్రమ వలసదారులకు స్వచ్ఛందంగా దేశాన్ని, వీడే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.దీనిలో భాగంగా అలా వెళ్లేవారికి విమాన చార్జీలతో పాటు ఖర్చులకు కొంత మొత్తం ఇస్తామని చెప్పారు. వారు మంచిగా ఉంటే, మేము వారిని తిరిగి దేశానికి తీసుకురావాలనుకుంటే, […]

తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్

తిరుమల అంశం మరోసారి రాజకీయ కాకకు కారణమవుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు భారీగా చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిదేమీ లేదని టీటీడీ ప్రకటించింది. అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తిరుమల వెళ్తున్నారు. వైసీపీ ఆరోపణలు చేస్తున్న టైంలో పవన్ కల్యాణ్ చేస్తున్న తిరుమల పర్యటన ఆసక్తిగా మారుతోంది. తన కుమారుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిందుకు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఇంటి వద్ద హైడ్రామా

సినీ నటుడు రాజ్‌ తరుణ, లావణ్య వివాద వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.  కోకాపేటలో తన కుమారుడు రాజ్‌ తరుణ్‌ కొనుగోలు చేసిన ఇంటిలో తాము ఉంటామంటూ బుధవారం ఆయన తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరిలు చేరుకున్నారు, వారు ఇంటి ముందు ఆందోళన దిగారు. ఇంట్లోకి వచ్చి తనను బలవంతంగా బయటకు నెట్టివేయాలని కుట్రలో భాగంగానే రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటామని చెప్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. మా ఇద్దరి మధ్య వ్యవహారం ఇంకా కోర్టులో కొనసాగుతుందని అప్పటివరకు […]

జపాన్ చేరుకున్న సీఎం రేవంత్.. ఎంబసీలో విందు

వారం రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. బుధవారం టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో భారత రాయబారి శిబు జార్జ్‌తో సీఎం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందానికి ఎంబసీలో విందు భోజనం ఏర్పాటు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కే రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, పలువురు అధికారులు ఈ విందులో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ..

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON