loader

రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు

రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్ధిష్ట గడువును నిర్దేశిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మ క తీర్పు వెలువరించింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 2020 నుం చి పెండింగ్‌లో ఉంచడం, మూడేళ్ల తరువాత 2023లో రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కో ర్టు నాలుగు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసిన […]

భారతీయ ఫార్మ కంపెనీ గొడౌన్‌పై రష్యా మిసైల్ దాడి!

కీవ్‌లోని ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గొడౌన్‌పై రష్యా క్షిపణితో దాడి చేసినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. తమ దేశంలోని భారతీయ వ్యాపారాలను రష్యా “ఉద్దేశపూర్వకంగా” లక్ష్యంగా చేసుకుందని న్యూఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. దీనికి ముందు ఆ దేశంలో బ్రిటన్ రాయబారి సైతం ఎక్స్‌లో వెల్లడించారు. ఆయన ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. కానీ, ఇది క్షిపణి దాడి కాదని, డ్రోన్లు అని ఆయన తెలిపారు. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తాకు చెందిన కుసుమ్.. ఉక్రెయిన్‌లోని […]

సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లన్నింటినీ రాసేస్తున్నది.. ఇంజినీరింగ్‌ విద్యపై ఏఐ ఎఫెక్ట్‌

ఇంజినీరింగ్‌ విద్య, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల అవసరం భారీగా తగ్గొచ్చని ఓపెన్‌ ఏఐ సీఈవో ఆల్ట్‌మన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సగానికిపైగా టెక్‌ కంపెనీల్లో ఏఐ కోడింగ్‌ను రాస్తున్నదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్‌ ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అన్నారు. ఒక్క ఏడాదిలో సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లన్నింటినీ ఏఐ రాయగలదని ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడై చెప్పారు. ఏఐ వినియోగంతో రాబోయే 18 నెలల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను పక్కకు తప్పించొచ్చు అనిసోషల్‌ […]

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు

అన్నాడీఎంకేలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడం బీజేపీకి ఇప్పుడు సవాలుగా మారింది. అన్నాడీఎంకేలోని మూడు వర్గాలను ఒకతాటిపైకి తీసుకొస్తేనే బలమైన డిఎంకెను కొట్టగలమని కమలనాథులు భావిస్తున్నారు. తద్వారా చల్లాచెదురైన అన్నాడీఎంకే ఓటు బ్యాంకును ఒకటి చేర్చి.. ఎలాగైనా తమిళనాడులో అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బిజెపితో ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే అన్నాడీఎంకే కూటమి నుంచి ముస్లిం మైనారిటీ పార్టీ అయిన ఎస్డిపిఐ బయటకు వచ్చింది. ఆ వెంటనే డిఎంకెను కూడా కలిసి మద్దతు ప్రకటించింది.

వైసీపీ పీఏసీ కమిటీ ఏర్పాటు…కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం…ఇటీవలే వైసీపీలో చేరిన మాజీమంత్రి సాకే శైలజానాథ్‌కు కూడా పీఏసీలోచోటు కల్పించారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్లబాబూరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్‌లకు పీఏసీలో చోటు […]

హనుమాన్ జయంతి స్పెషల్… చిరు విశ్వంభర లో రామ రామ సాంగ్

మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబ సభ్యులకు హనుమంతుడు అంటే ఎంత భక్తి అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తమ కుల దైవంగా భావిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’ నుంచి‌ ‘రామ రామ’ విడుదల చేశారు.

జలియన్ వాలాబాగ్

భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన శాంతియుత వేడుకరులను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది, ఇక్కడ జరిగిన ఈ దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం

9 కోట్ల మందికిపైగా ఐటీ రిటర్న్స్ దాఖలు..

ఆర్థిక సంవత్సరం 2024-25లో మార్చి 31 నాటికి భారతదేశంలో 9.19 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమోదైంది. మహారాష్ట్రలో అత్యధికంగా రిటర్న్‌లు ఫైల్ కాగా, రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారే అధిక సంఖ్యలో ఉన్నారు. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 3.24 లక్షల మంది కూడా రిటర్న్‌లు దాఖలు చేశారు.

వాట్సాప్‌ ఇమేజ్‌ స్కామ్‌!.. సైబర్‌ నేరగాళ్ల నయా మోసం

సైబర్‌ మోసాల కోసం నేరగాళ్లు తాజాగా ఇమేజ్‌ స్కామ్‌ పేరుతో కొత్త మోసానికి తెర లేపారు స్టెగానోగ్రఫీ సాంకేతికత సాయంతో స్కామర్లు ఈ మోసానికి పాల్పడతారు. ప్రమాదకరమైన కోడ్‌ కలిగిన ఇమేజ్‌ కోడ్‌ను మన వాట్సాప్‌కు పంపిస్తారు. ఈ ఇమేజ్‌ను తెరిస్తే.. మాల్‌వేర్‌ దానంతట అదే ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయి సున్నిత సమాచారాన్ని గ్రహిస్తుంది.  స్కామ్‌ బారిన పడకుండా ఉండాలంటే.. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫొటో, వీడియో లేదా లింక్‌లను తెరవకూడదు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో ఆటో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON