loader

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు.. మంత్రి నిమ్మల ఏమన్నారంటే..

రామగిరిలో జగన్‌ టూర్‌ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ డ్యామేజ్‌ అయింది. జగన్‌ భద్రతపై తమకు ఆందోళన ఉందంటున్నారు వైసీపీ సీనియర్‌ నేత బొత్స హెలిపాడ్ దగ్గర వంద మంది పోలీసులు కూడా లేరన్నారు. వైసీపీ నేతలు డబ్బులు పంచిపెట్టి హెలికాప్టర్‌ దగ్గరకు జనసమీకరణ చేశారని హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను పెడితే , భద్రత […]

యంగ్ ఇండియా నా బ్రాండ్

16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొం దరు నన్ను అడిగారని యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అని రేవంత్ అన్నారు. కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈరోజు తాను క్రియేట్ చేసిన ‘యంగ్ ఇండియా’ బ్రాండ్‌ను మహాత్ముడి స్ఫూర్తితో తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు […]

యూనివర్సిటీల్లో అధ్యాపకులేరి?

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జేఎన్‌టీయూ వంటి స్టేట్‌ యూనివర్సిటీలలో ప్రమాణాలు పడిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కలిపి 2,816 పోస్టులు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 2,059 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. వర్సిటీలో బోధన కుంటుపడిందని సీనియర్‌ ప్రొఫెసర్లు, […]

ట్రంప్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేందుకు… చైనా గట్టిగానే యత్నిస్తోందిగా

చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 125 శాతం సుంకం విధించి వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. దీంతో బీజింగ్ యూరోపియన్ యూనియన్ (EU), ఆసియాన్ దేశాలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి అమెరికాను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మరోస్ సెఫ్కోవిక్ మంగళవారం వీడియో ద్వారా చర్చలు జరిపారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ హెచ్‌ డీ ప్రింట్‌ లీక్‌, విడుదలైన 8 గంటల్లోనే ఆన్‌లైన్‌లో.. అజిత్‌ ఫైర్

అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తమిళనాడులో గురువారం (ఏప్రిల్‌ 10)న విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. విడుదలైన 8 గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీతో ఇంటర్నెట్‌లో లీక్ కావడం షాక్‌కు గురిచేసింది. దీనిని అడ్డుకోవడానికి నటీనటుల సంఘం, చిత్ర యూనిట్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. తమిళ్ రాకర్స్ మాత్రమే కాకుండా, వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ పేజీలో కూడా సినిమాకు సంబంధించిన లింక్ వేగంగా […]

మామూలు వాకింగ్ కన్నా రెట్టింపు ఆరోగ్యాన్నిచ్చే జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్

ముందుగా ఓ మూడు నిముషాలు మెల్లగా నడవాలి. అదే సమయంలో కండరాలన్నీ కదిలేలా చూసుకోవాలి. మూడు నిముషాలు పూర్తయ్యాక వెంటనే వేగాన్ని పెంచాలి. అంటే వేగంగా నడవాలి. దాదాపు మూడు నిముషాల పాటు ఇలా చేయాలి. ఆ తరవాత మళ్లీ మూడు నిముషాలు నెమ్మదిగా నడవాలి. ఇలా ఓ అరగంట పాటు చేస్తే చాలు. మామూలు వాకింగ్ తో వచ్చే ఆరోగ్యం కన్నా రెట్టింపు ప్రయోజనాలుంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్ కశ్ ఖాన్ అంటున్నారు.

భారత ప్రథమ సామాజికతత్వవేత్త

అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.

డిప్యూటీ సీఎం; పవన్‌పై కవిత విమర్శలు

ఓ మీడియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కవిత, పవన్ హిందీ, సనాతన ధర్మ పోరాటంపై స్పందిస్తూ చెగువేర ఎటు వెళ్లిపోయాడో ఇప్పుడు పూర్తిగా రైటిస్టుగా మారిపోయాడు, రాజకీయంగా ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా తనకు తానే విభేధించుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి రేపు తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా చెబుతారు. అందుకే నిజంగా ఆ వ్యాఖ్యలపై స్పందించాలని లేదు. సీరియస్ రాజకీయ నాయకుడని అనుకోవడం లేదు. జనసేన నాయకులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON