loader

మరోసారి పోలీస్ స్టేషన్‏కు చేరిన మంచు పంచాయితీ..

మంచు మోహన్‌బాబు ఇంట్లోని వివాదాలకు ఏమాత్రం ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. పెదరాయుడి కుటుంబంలో ఫైట్‌కు కాస్తా బ్రేక్‌ పడిందనుకునేలోపే.. మళ్లీ వైలెంట్‌ సీన్లు దర్శనమిస్తున్నాయి. తాను ఇంట్లో లేనప్పుడు కారుతోపాటు కాస్ట్‌లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్‌. జల్‌పల్లిలోని ఇంటిలోకి 150మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ.. విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు.

పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని.. కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అకీరాకు సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే.. స్వయంగా తానే ఇన్ […]

హెచ్‌సియూ ఏఐ ఫొటోలు, వీడియోలు ఫేక్

బుల్డోజర్లు, పక్కనే ఎగురుతున్న నెమ్మళ్లు సమీపంలో ఉన్న జింకలు అంతా ఏఐ క్రియేషని పోలీసులు గుర్తించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫొటోలను షేర్ చేసిన బిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె క్రిశాంక్, దిలీప్ కొణతంలకు నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఈ ఫొటోలను షేర్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెచ్‌సియూ భూములు కాపాడాలని సినిమా తారలు కూడా పోస్టులు పెట్టారు. అందరూ దాదాపుగా […]

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలు

ఎంతో ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణ, యూనివర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్స్‌లర్ జీపీ రాజశేఖర్‌తో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల ప్రారంభ వేడుకను నిర్వహించనున్నట్లు […]

వక్ఫ్ చట్టం అమలు… కేంద్రం నోటిఫికేషన్ జారీ

వక్ఫ్ (సవరణ) చట్టం 2025 అధికారికంగా ఏప్రిల్ 8 మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం అమలులోకి వచ్చిన తేదీని న్యాయ, మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసింది వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో  కేవియట్ దాఖలు చేసింది.

పోలీస్‌ యూనిఫాం మేం కష్టపడి సాధించాం:జగన్‌ వ్యాఖ్యలకు ఎస్పీ రత్న కౌంటర్

శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ఏపీ పోలీసులపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కౌంటర్ ఇచ్చారు. పోలీస్ యూనిఫాం మే కష్టపడి సాధించాం అని చెప్పుకొచ్చారు. మేం తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని ఎస్పీ రత్న వెల్లడించారు. తాము ఎవరికీ అనుకూలంగా పని చేయలేదు అని […]

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల […]

అట్లుంటది మనతోని.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు..

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రయాణికుల రాకపోకలలో ఆశ్చర్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయం 15.20 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఏడాది RGIA విమానాశ్రయం ద్వారా ప్రయాణించడం గమనార్హం. ఇదే రీతిలో రద్దీ కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల మార్కును దాటి మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశముందని అంచనా..

ముదురుతోన్న వాణిజ్య యుద్ధం.. చైనాకు ట్రంప్ వార్నింగ్

అమెరికా (USA), చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై చైనా 34% అదనపు సుంకం విధించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8లోగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఏప్రిల్ 9 నుంచి 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం’ […]

ట్రంప్ సుంకాల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ట్రంప్ 180 దేశాలపై సుంకాలను పెంచారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం అయ్యింది. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు నష్టాలు చూవి చూడాల్సి వచ్చింది. ఇంతలో సోమవారం ట్రంప్ సుంకాల విధానాన్ని 90 రోజుల పాటు కొనసాగించాలని ఆలోచిస్తున్నారనే వార్తలు వ్యాపించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON