loader

LPG గ్యాస్ షాక్.. సిలిండర్ ధర పెంపు..

గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.21.45 కోట్లు అదనంగా చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.905కు, నల్గొండలో రూ.927కు, విజయవాడలో రూ.875.50కి చేరింది.

ఆ ఘటన పట్ల విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ విశాఖపట్నానికి వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. పెందుర్తి ప్రాంతంలో కొందరు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడానికి తన కాన్వాయ్ కారణమంటూ వచ్చిన వార్తలపై సమగ్ర నివేదిక […]

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్య శ్రీ సేవలు) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు.

యూజీసీలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా!

యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం జారీచేసిన జీవోపై అభ్యంతరాలొస్తున్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు 30 మార్కులు కేటాయించాలని యూజీసీ స్పష్టంచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలో పీహెచ్‌డీ ఉంటే 10 మార్కులు కేటాయిస్తామని పేర్కొన్నారు. దీంతో పీహెచ్‌డీ అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోపిస్తున్నారు. జీవోతో 20 మార్కులు కోల్పోవాల్సి ఉంటుందని పీహెచ్‌డీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కాన్వాయ్.. విద్యార్థులు పరీక్షకు దూరం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్ కారణంగా విశాఖలో దాదాపు 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో అదే మార్గంలో వెళ్లాల్సిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మార్నింగ్ షిఫ్ట్ కి సకాలంలో వెళ్లలేక పరీక్షకు దూరం అయ్యారు. దీంతో ఇన్నేళ్ల తమ కష్టానికి ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇప్పుడా విద్యార్థుల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ చొరవ చూపి మళ్లీ పరీక్ష రాసే […]

కొన్ని సినిమాలపై ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు..

తమిళంలోనూ ఓ సినిమాపై ఇలాంటి క్రేజే ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అలా రిలీజ్ అయిందో లేదో.. సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది ఆ దెబ్బకుగుడ్ బ్యాగ్ అగ్లీ ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు అజిత్ ఫ్యాన్స్. చాలా ఏళ్ళ తర్వాత అజిత్‌లోని స్టైలిష్ యాంగిల్ బయటికి తీసుకొచ్చారు దర్శకుడు అధిక్. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు.. అజిత్ కూడా బయటికి రావట్లేదు కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. […]

కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు,

వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు నమోదవుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షనింగ్ జరిగింది. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ ఎదుట ఆ పిటిషన్లను మెన్షన్ చేశారు. ఈ పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు రాజకీయ పార్టీలు, నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మెన్షనింగ్‌ను పరిశీలిస్తామన్నారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON