loader

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

ఆదాయపు పన్ను శాఖ నటుడు-దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. 2022లో విడుదలైన మూడు సినిమాల నుండి పృథ్వీరాజ్ సంపాదించిన ఆదాయం గురించి వివరాలను స్పష్టం చేయాలని నోటీసులో కోరారు. ఎంపురాన్ సినిమా విడుదలైనప్పటి నుంచి రాజకీయ వివాదాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. “నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేము ఎలాంటి దర్యాప్తుకూ భయపడము” ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తోన్న వారికి కృతజ్ఞతలు […]

ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు నెట్ వర్క్ నోటీసులు ఇచ్చింది. 600 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి.పేరుకు ఏపీ రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం.ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని […]

మైక్రోసాఫ్ట్ వేడుకల్లో గేట్స్ ఎదుటే సత్య నాదెళ్లను నిలదీసిన ఉద్యోగి..

మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవం సందర్బంగా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల; మాజీ CEOలు స్టీవ్ బాల్మర్, బిల్ గేట్స్ వేదికపై కంపెనీ గురించి మాట్లాడుతుండగా.. భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ గట్టిగా నినాదాలు చేశారు. ‘మీ అందరికీ సిగ్గుండాలి.. మీరంతా కపట వ్యక్తులు.. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో గాజాలో 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు తీశారు.. మీకు ఎంత ధైర్యం. వారి రక్తంతో వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ సిగ్గుండాలి.. ఇజ్రాయేల్‌తో సంబంధాలు తెంచుకోండి’ వానియా గట్టిగా కేకలు […]

అడవితల్లి బాటలో పవన్ కళ్యాణ్

గిరిజన గ్రామాలలో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలు కట్టుకొని ఆసుపత్రులకు తీసుకు వెళ్లిన అనేక ఘటనలు మనం చూసాం. అయితే అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవితల్లి బాట పేరుతో రోడ్లను అభివృద్ధి చేయాలని సంకల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పాటు గిరిజన గ్రామాలలో పర్యటించనున్నారు. నేడు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

మరోసారి బ్యాంకుల విలీనం.. కేంద్రం ప్రకటన..

బ్యాంకుల విలీనానికి మరోసారి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, ఖర్చుల హేతుబద్ధీకరణ చేపట్టడమే లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమేరకు దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లను 28కి కుదించనున్నట్లు పేర్కొంది. ఒక రాష్ట్రం- ఒక ఆర్ఆర్‌బీ(Regional Rural Bank) ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు.

మూడేండ్లలో 80% పెరిగిన స్కూల్‌ ఫీజులు

మన దేశంలోని ప్రైవేట్‌ స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని లోకల్‌ సర్కిల్‌ సర్వే వెల్లడించింది. 309 జిల్లాల్లో 31 వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 2022-2025 మధ్య ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులు 80 శాతం పెరిగాయని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. 50-80 శాతం పెరిగాయని 36 శాతం మంది చెప్పారు. 30-50 శాతం పెంపుదల కనిపించిందని 8 శాతం మంది, 10-30 శాతం పెంచారని 27 శాతం […]

సుదర్శన్ పట్నాయక్‌కు యూకే శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌

ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్‌ డారింగ్టన్‌ శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌’ను అందుకున్నారు. ఇంగ్లండ్‌లోని వేమౌత్‌లో మొదలైన 2025 ఇంటర్నేషనల్‌ శాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో సుదర్శన్‌ పట్నాయక్‌కు నగర మేయర్‌ జాన్‌ ఓరెల్‌ మెడల్‌, అవార్డును అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్‌ సైకత శిల్పి ఫ్రెడ్‌ డారింగ్టన్‌ పేరుమీదుగా బ్రిటన్‌ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తున్నది. ఈ […]

భారత్‌ సహా 14 దేశాల వీసాలు రద్దుచేసిన సౌదీ అరేబియా..

ఉమ్రా, బిజినెస్‌, ఫ్యామిలీ విజిట్‌ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్‌ లేకుండా హజ్‌ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. చాలా దేశాల నుంచి ఇటువంటి వీసాలపై వచ్చి, గడువు ముగిసినప్పటికీ సౌదీ అరేబియాలోనే ఉంటూ, అధికారిక ధ్రువీకరణ లేకుండా హజ్‌లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. హజ్‌ యాత్ర సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు వీసాల జారీపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలిపింది.

ట్రంప్‌.. హ్యాండ్సాఫ్‌!.. అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రభుత్వ సలహాదారు, డోజ్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. ‘హ్యాండ్సాఫ్‌’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశంలోని 50 రాష్ట్రాలో దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బిలియనీర్ల పెత్తనానికి చెక్‌ పెట్టాలని, ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని, మెడిక్‌ఎయిడ్‌, సామాజిక భద్రత పథకాలకు నిధుల కోతను ఆపాలని, వలసదారులు, ట్రాన్స్‌జెండర్లు, ఇతర కమ్యూనిటీలపై దాడులను ఆపాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు

తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2025 సంవత్సరానికి ” ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు ” అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948లో, WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON