loader

చరిత్ర సృష్టించిన పంబన్ వంతెన.. 100 ఏళ్లు గ్యారంటీ..

దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపేలా నిర్మించారు. నిలువుగా పైకి లేచేలా వర్టికల్ టెక్నాలజీతో ఈ వారథిని నిర్మించారు.2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు ప్రారంభించింది. నాలుగేళ్లలో పూర్తిచేసింది. నిర్మాణంలో కొంచెంకూడా తేడా రాకుండా నిపుణులు జాగ్రత్తలు తీసుకున్నారు. సముద్రంలో రెండు కిలోమీటర్లు పైగా పొడవున్న ఈ వంతెన కింద ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. దీనికి […]

ట్రంప్‌ సర్కారుపై అమెరికావ్యాప్తంగా భారీ నిరసనలు..

దేశవ్యాప్తంగా ట్రంప్‌ సర్కారుపై అమెరికావ్యాప్తంగా భారీ నిరసనలు.. పాలనపై వ్యతిరేకత మిన్నంటుతోంది. అమెరికా అధ్యక్షుడు యంత్రాంగం విధానాలు, నిర్ణయాలపై ఆ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో నిరసనకారులు ప్లకార్డులతో ప్రదర్శనలు వీధుల్లో ఇచ్చారు. అయితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడం, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ కార్యాలయాలను సైతం మూసివేయడం, వలసదారులను బహిష్కరించడం, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తుల రక్షణలను తగ్గించడం ఇవి ప్రధానంగా నిరసనకారుల్లో వ్యతిరేకతకు కారణం.

ఢిల్లీకి వెళ్లాలి మళ్లీ.. మళ్లీ..

రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత సంవత్సరన్నర కాలంగా మంత్రి వర్గ విస్తరణ అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంటూ కాలయాపన చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. అధిష్ఠానాన్ని మెప్పించటానికి అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీలో చర్చలు జరగటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వింతగా గమనిస్తున్నారు.

ఏఐతో 140 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం.. పెరగనున్న ఆదాయ అసమానతలు: యూఎన్‌సీడీఏడీ

యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీడీఏడీ) తెలిపిన వివరాల ప్రకారం ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల (40 శాతం) ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన శ్రమపై ఆధారపడిన దేశాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ఈ ఏఐ అభివృద్ధిని ప్రపంచమంతటా సమానంగా పంచుకోదు.ఈ అభివృద్ధి కొన్ని సంస్థలకో, లేదా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కేంద్రీకృతం కావచ్చు. ప్రధానంగా అమెరికా, చైనాలు ఈ విషయంలో ముందుండి అసమానతలో మిగతా దేశాలకు హెచ్చరికగా […]

‘ఎంపురాన్‌’ నిర్మాతపై ఈడీ దాడులు

మలయాళ సినిమా ‘ఎంపురాన్‌’ నిర్మాత గోకులం గోపాలన్‌ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా దాడులు చేపట్టింది. చెన్నై, కొచ్చి, కర్ణాటకలలో ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి కీలక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిపిన సోదాల్లో రూ.1.5 కోట్ల నగదును ఈడీ సీజ్‌ చేసినట్టు తెలిసింది. అక్రమ నగదు లావాదేవీలతో వచ్చిన నిధులను ఉపయోగించి ‘ఎంపురాన్‌’ సినిమా తీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

విదేశీ డిగ్రీల గుర్తింపుపై కొత్త నిబంధనలు

అంతర్జాతీయ డిగ్రీలు లేదా స్కూలు విద్యార్హతలతో చాలా మంది విద్యార్థులు భారత్‌కు తిరిగివస్తారని, అయితే వాటికి గుర్తింపు పొందడంలో తీవ్ర జాప్యాలు, అవరోధాలు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. ఈ కొత్త నిబంధన స్పష్టతను, కచ్చితమైన అంచనాను, నిష్పాక్షికతను అందచేయగలదని ఆయన వివరించారు. విదేశీ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను యూజీసీ ప్రారంభించనున్నది. విద్యా సంబంధ నిపుణులతో కూడిన స్టాండింగ్‌ కమిటీ ఈ దరఖాస్తులను సమీక్షించి 15 పని దినాలలో తన నిర్ణయాన్ని […]

ఇషాసింగ్‌కు రజతం.. షూటింగ్‌ ప్రపంచకప్

బ్యూనస్‌ ఎయిర్స్‌(అర్జెంటీనా) వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన వేర్వేరు విభాగాల్లో సిఫ్ట్‌కౌర్‌ సమ్రాకు స్వర్ణం, ఇషాసింగ్‌ రజత పతకంతో మెరిశారు. మహిళల 25మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో తెలంగాణ యువ షూటర్‌ ఇషాసింగ్‌ 35 స్కోరుతో రజత పతకంతో మెరిశారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఒలింపియన్‌ కాంస్య విజేత మను భాకర్‌ను ఇషాసింగ్‌ ఓడించి ముందంజ వేసింది.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!

ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని.. శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!

కొంపలు ముంచుతున్న AI.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న నిపుణులు

కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి లోతుగా ప్రవేశిస్తున్న తరుణంలో, ఇది మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI సలహాలు పాటిస్తూ మనుషులు, తమ సంబంధాల్ని వదులుకొని, రోబోలకు దగ్గరవుతున్నారనీ, ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు AI చాట్‌బాట్ సలహాతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. AI తో మాట్లాడుతూ ఉంటే  చక్కగా మాట్లాడుతుంది.మెచ్చుకుంటుంది, సలహాలు ఇస్తుంది. సూపర్ అంటుంది AI బెటర్ […]

ఫోర్బ్స్ రిచ్ లిస్ట్: పాపం అంబానీ.. మరీ ఇంతలా పడిపోయాడేంటి?

ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేసిన ప్రతిసారీ మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తప్పకుండా టాప్ 10లో ఉండేవారు. ఈసారి మాత్రం ఏకంగా 18వ స్థానానికి పడిపోయారు. కొంతకాలంగా రిలయన్స్ షేర్లు కుదేలవడమే  అందుకు కారణం. అంబానీ రూ.7.85 లక్షల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 28వ స్థానంలో నిలిచారు. ప్రపంచంలో 3028 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON