loader

థాయ్‌ ప్రధాని విందు.. పక్క పక్కనే కూర్చున్న మోదీ, యూనస్..!

బ్యాంకాక్‌లో జరుగుతోన్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (బిమ్‌స్టెక్-BIMSTEC) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సభ్య దేశాధినేతలకు థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ విందులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌లు పక్కపక్కనే కూర్చుని కలిసి భోజనం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూనస్ మధ్య సమావేశం జరిగే అవకాశం […]

అమెరికన్‌ గోల్డ్‌కార్డు విడుదల చేసిన ట్రంప్‌..

అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డు కొనుక్కోవాలని గతంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ గోల్డ్ కార్డు  ఫస్ట్ లుక్  విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో  విలేకరులతో మాట్లాడుతూ ఆయన గోల్డ్‌ కార్డు ఫస్ట్‌ లుక్‌ను చూపించారు. ఈ గోల్డ్ కార్డును EB5 వీసాకు ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. దీని అర్థం ఇన్వెస్టర్ల వీసా విధానాన్ని రద్దుచేసి దాదాపు 5 మిలియన్‌ డాలర్లు వెచ్చించే వారికి అందిస్తారు. మన రూపాయిలో ఇది […]

రాజ్యసభలో కూడా లైన్ క్లియర్.. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం…

రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ సాగింది. అర్దరాత్రి దాటి తర్వాత ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా… మొత్తం మీద బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, బిల్లుకు వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపినట్టు అయింది. తదుపరి ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వక్ఫ్ (సవరణ) […]

హెచ్‌సియులో హైకోర్టు రిజిస్ట్రార్

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను పరిశీలించారు. దాదాపుగా ఐదు కిలోమీటర్ల కాలినడకన పర్యటించి వివరాలు సేకరించారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రిజిస్ట్రార్ హెచ్‌సియు భూములకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ను కలిసి వర్సిటీలో ధ్వంసమైన భూమిని చూపించారు. అన్ని వరాలు సేకరించి విశ్లేషించి హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించారు.

ఆ భూములెవరూ కొనొద్దు

గచ్చిబౌలిలో భూములు ఎవరూ కొనొద్దని, ఒకవేళ ఎవరైనా కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో అద్భుతమైన ఏకో పార్క్‌ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో తమ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

14న రోదసిలోకి ఆరుగురు మహిళలు

జెఫ్‌ బెజోస్‌ నేతృత్వంలోని ఏరోస్పేస్‌ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ ఈ నెల 14న ఆరుగురు మహిళలను అంతరిక్ష పర్యాటకానికి పంపిస్తున్నది. ఈ ప్రయాణం 10 నిమిషాలపాటు ఉంటుంది. గ్లోబల్‌ పాప్‌ ఐకాన్‌ కేటీ పెర్రీ, నాసా మాజీ రాకెట్‌ సైంటిస్ట్‌ అయిషా బోవే, బయోయాస్ట్రోనాటిక్స్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ అమంద ఎన్‌గుయెన్‌, ప్రముఖ పాత్రికేయురాలు గేలీ కింగ్‌, ఫ్యాషన్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఫిలిం నిర్మాత కెరియన్నే ఫ్లిన్‌, జెఫ్‌ బిజోస్‌ ప్రియురాలు, ఎమ్మీ అవార్డ్‌ విజేత లారెన్‌ శాంచెజ్‌ […]

వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో రచ్చ

రాజ్యసభలో సైతం వక్ఫ్ సవరణ బిల్లు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్లింలకు ఎలాంటి ప్రమాదం జరగబోదని అధికార పక్షం హామీ ఇస్తే.. రాజ్యాంగంపై దాడిగా ప్రతిపక్షం ఆరోపించింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమా డైలాగ్‌తో అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ భూమిని ఆక్రమించారంటూ అధికార పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మోదీకి థాయి ప్రధాని ప్రత్యేక గిప్ట్ …

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెయిటోంగ్‌టార్న్ షిన్‌వత్రా ఆయనకు “ది వరల్డ్ త్రిపీటిక : సజ్జయ పొనెటిక్ ఎడిషన్” అనే త్రిపిటకాన్ని బహుమతిగా ఇచ్చారు. మోదీకి థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఇచ్చిన బహుమతి త్రిపిటక (పాలీలో) లేదా త్రిపిటకం (సంస్కృతంలో) అనేది బుద్ధుని బోధనల యొక్క ప్రసిద్ధ సమాహారం. ఇందులో 108 సంపుటాలు ఉన్నాయి. ఇది ప్రధాన బౌద్ధ గ్రంథంగా పరిగణించబడుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON