loader

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.

బంకర్లలోకి ఉగ్రవాదులు పరుగులు.. పీవోకే ను ఖాళీ చేస్తున్న పాకిస్థాన్ ఆర్మీ

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. కచ్చితంగా దాడి ఉంటుందని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా […]

అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ వేడుకలు.. ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన

అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన క్రతువు పూర్తి చేసినట్లుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని వైశాఖ శుక్లపక్ష విదియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రతిష్టించినట్లు తెలిపారు. రామ మందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. రామ్‌దర్భార్‌లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు […]

వైభవ్‌ సూర్యవంశీ కు నజరానా

ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఆటకు స్టేడియంలో ప్రేక్షకులు, టీవీల ముందు మ్యాచ్‌ను వీక్షించిన కోటానుకోట్ల క్రికెట్‌ అభిమానులే కాదు.. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సైతం ఫిదా అయ్యారు. నిండా 15 ఏండ్లు కూడా నిండని వైభవ్‌.. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే రికార్డు శతకం సాధించి ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించాడు. నితీశ్‌ కుమార్‌.. రాష్ట్రప్రభుత్వం తరఫున వైభవ్‌కు రూ.10 లక్షల నగదు బహుమానం ప్రకటించారు.

మే 29న రోదసిలోకి శుభాన్షు శుక్లా

‘ఏఎక్స్‌-4’ మిషన్‌ పైలట్‌గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతరిక్షంలోకి వెళ్తున్నారు. భారత్‌, పోలండ్‌, హంగేరీ వ్యోమగాములతో కూడిన అంతర్జాతీయ బృందానికి నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ నేతృత్వం వహిస్తున్నారు. వ్యోమగాములు ప్రయాణిస్తున్న స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ రాకెట్‌ను మే 29 ఉదయం 10.33 గంటలకు ప్రయోగిస్తున్నట్టు సమాచారం. ఐఎస్‌ఎస్‌లో అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డ్‌ సృష్టించనున్నారు. 1984లో భారత వ్యోమగామి రాకేశ్‌ శర్మ తర్వాత మళ్లీ ఇన్నేండ్లకు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయుడు

అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గత వారం రోజులనుంచి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మరోవైపు ఎపిలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యు జీడిపాలెం పంచాయతీ పరిధిలో రెండు చోట్ల మావోయిస్టు కదిలికలను గుర్తించారు. మావోయిస్టులను గమనించిన పోలీసులు కాల్పులు జరుపగా, అప్రమత్తమైన మావోయిస్టులు ఎదురుకాల్పు జరిపి చివరి నిమిషంలో తప్పించుకున్నారు.

పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే.. అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్

పహల్గాం ఉగ్ర దాడి ఘటన తర్వాత కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన 26 మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత కూడా.. అలా మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్.. మత ప్రాతిపదికన చంపడం దారుణమని మండిపడ్డారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని.. పవన్ కళ్యాణ్ సూచించారు.

అడ్మిషన్లకు తిరగలేక.. డీఎస్సీకి చదవలేక

ఐదేళ్లుగా ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు డీఎస్సీ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్నారు. అడ్మిషన్ల పేరుతో సంబంధిత సూళ్ల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తుండడంతో డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లు, అధ్యాపకులుగా పని చేస్తున్న కొందరు అభ్యర్థులు మాత్రం అడ్మిషన్ల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. నెల రోజులు ఇంటి వద్ద ఉండి చదువుకోవాలని అనుకుంటున్న తమకు కుదరడం లేదని ప్రైవేట్‌ టీచర్లు […]

సిజెఐగా గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. మే 13న ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో గవాయి మే 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాజ్యాంగం అధికారాల ప్రకారం ఈ నియామకం జరిగిందని ధృవీకరిస్తూ.. కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు

భారత గూఢచారి డ్రోన్ ను కూల్చిన పాక్

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రరిస్ట్ దాడి తర్వాత ఉద్రిక్తతల నడుమ భారత గూఢచారి డ్రోన్ ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. మంగళవారం భారత్ కు చెందిన మానవరహిత డ్రోన్ సరిహద్దురేఖను దాడి తమ గగన తలంలో ప్రవేశించగా దానిని పాక్ సైనికులు కూల్చివేశారని పాక్ టీవీ చానల్ ప్రకటించింది. సరిహద్దులలో నిఘాకోసం ఉభయ దేశాలు చిన్నచిన్న డ్రోన్ లను ఉపయోగించడం సాధారణమే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON