loader

మయన్మార్‌కు మరోసారి భారత్ 30 టన్నుల విపత్తు సాయం

మయన్మార్, థాయిలాండ్ భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే.  భూకంపాల ధాటికి మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. మయన్మార్, థాయిలాండ్ లో మృతిచెందిన వారి సంఖ్య 16వందలకు చేరింది. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్మూక్, ఎల్ సీ యూ 52 లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై […]

ఎమ్మెల్సీ నాగబాబు ఆశలపై నీళ్లు…కేబినెట్ విస్తరణపై సీఎం, డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం

ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. ఏడాదిలోపే మంత్రి వర్గ విస్తరణ చేయడం…వారిలో కొంతమంది మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొనే అవకాశం ఉంటుంది అని సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోం

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని.. భారీగా తగ్గిన టోల్ టాక్స్

కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్స్‌లు తగ్గాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది. వాహనాలకు టోల్‌ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై మంగళవారం(ఏఫ్రిల్ 1) తెల్లవారుజాము నుంచి అమలులోకి రానున్నాయి.

రామ్ చరణ్ పెద్ది టీమ్.. వీడియో గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..

్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ మాస్ అవ‌తార్‌ని చూసి అంద‌రూ అభినందించారు. ఈ పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో సంచ‌లనాన్ని సృష్టించాయి. పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్‌. ‘ఫ‌స్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ […]

హెచ్‌సియులో ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. విశ్వ విద్యాలయంలోని భూముల విక్రయించేందుకు ప్రభుత్వం యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల్లో చెట్లను కొట్టివేస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా యూనివర్సిటీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు యూనివర్సిటీ మెయిన్ గేట్‌కు తాళం వేసి, జెసిబిలతో చెట్లను కూల్చివేసి చదును చేశారు.

సన్నబియ్యం స్కీం ఎవరూ ఆపలేరు

‘పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని సన్నబియ్యంతో బువ్వ పెట్టే పథకంతో నిజం చేయాలన్నదే నా సంకల్పం. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుంటా. వాటిలో కొన్ని సంక్షేమ పథకాలు చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోతాయి. ఆ కోవలోనిదే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సన్నబియ్య పథకం’ ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని, ఉగాది రోజున సన్నబి య్యం పంపిణీని ప్రారంభించటం తనకెం తో సంతోషకరంగా ఉందని వెల్లడించారు.

డీపీలు మార్చి.. ఉద్యోగులను ఏమార్చి.. సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసాలు!

సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలు వెతుకుతున్నారు. అందినకాడికి డబ్బులు దండుకునేందుకు ఐటీ సంస్థల యజమానులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వెంటపడ్డారు. కంపెనీల సీఎండీ, ఎండీ, సీఈవోల ఫొటోలతో డీపీలు సెట్‌ చేసుకుని, కంపెనీలోని అకౌంట్స్‌ ఆఫీసర్లు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు మెసేజ్‌లు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు తెలంగాణలో వెలుగు చూస్తుండటంతో కొత్తతరహా సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

జిబ్లీ వాడకం తగ్గించరూ..ప్లీజ్‌.. నెటిజన్లను కోరిన ఆల్ట్‌మన్‌

చాట్‌జీపీటీలో ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమేజ్‌ జెనరేటర్‌ ‘జీబ్లీ’ స్టూడియోకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌..ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలు కనిపిస్తున్నాయి. జిబ్లీ ఇమేజ్‌ జనరేటర్‌ను విస్తృతంగా వాడటం వల్ల తమ ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పోయిందని ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ వాపోయారు. దయచేసి దీని వాడకాన్ని తగ్గించుకోవాలని నెటిజన్లను ఆయన కోరారు.

హెచ్‌సీఏ x ఎస్‌ఆర్‌హెచ్

అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్‌ను వదిలివెళ్తామని సన్‌రైజర్స్‌ విడుదల చేసిన ఈ-మెయిల్‌ తీవ్ర దుమారం రేపుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి ఎలాంటి ఈ-మెయిల్‌ రాలేదని హెచ్‌సీఏ స్పందించింది స్టేడియం దక్షిణ భాగంలోని మొదటి అంతస్తులో గల ఎఫ్‌-12ఏ బాక్సులో కాంప్లిమెంటరీ పాసుల దగ్గరే ఇరువర్గాలు ఏకాభిప్రాయం కుదరడం లేదని వినికిడి.

యూట్యూబ్ ఛానెల్ ద్వారా మోదీకి ఒకే వీడియోకు కోటికిపైగా ఆదాయం..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అకౌంట్లను ఫాలో అయ్యే వారు కోట్లలో ఉన్నారు. మార్చి 2న 3,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వనతారా వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని మోదీ సందర్శించిన వీడియోను యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 50.4 కోట్ల మంది వీక్షించారు. అంటే ఈ ఒక్క వీడియో ద్వారనే ప్రధాని మోదీ కోటి రూపాయలకు పైగా సంపాదించారని చెప్పవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON