తదుపరి సీఎంగా ఆయనకే జైకొట్టిన జనం.. సీ ఓటర్ సర్వే
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.ఏడాది ముందు నుంచే అన్ని పార్టీలు ఎన్నికలకు సమర శంఖం పూరించాయి. సీ ఓటర్ సర్వేలో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరుండాలి? అనే ప్రశ్నకు అత్యధికంగా 27 శాతం మంది స్టాలిన్ పేరు చెప్పారు. రెండో స్థానంలో ఉన్న విజయ్‌కు 18 శాతం, ఎడప్పాడి పళనిసామికి 10 శాతం, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకు 9శాతం మంది మద్దతు ఇచ్చారు.