loader

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం… పవన్ కల్యాణ్ స్పెషల్ విషెస్…

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పెషల్ విషెస్ తెలిపారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ  43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. నాటి నుండి నేటి వరకు టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను […]

లైగర్, రాబిన్‌హుడ్..స్పోర్ట్స్ స్టార్స్ క్యామియోలు ఫ్యాన్స్ కు నిరాశే

ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి, సినిమాకి క్రేజ్ తీసుకురావడానికి స్పెషల్ అప్పీరియన్సులు, గెస్ట్ రోల్స్, ప్లాన్ చేస్తుంటారు మన ఫిలిం మేకర్స్. వార్నర్ మామా తెలుగు సినిమా ద్వారా ఇండియన్ ఫిలిం  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించడంతో అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఎంతో స్పెషల్ అని టీం అంతా చెబుతూ వచ్చిన ఈ పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ దక్కలేదు. అసలు ఆ పాత్రకు సినిమాలో ప్రాధాన్యత లేదు. ఆ క్యారెక్టర్ ను ఎందుకు పెట్టారన్నది కూడా […]

మయన్మార్‌ భూకంపం ఘటనలో 1000 మృతి, భారత్‌ భారీ సాయం..

శుక్రవారం థాయిలాండ్, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో కూడిన భూకంపం వచ్చింది. ఈ ధాటికి థాయిలాండ్ , మయన్మార్‌ దేశాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మయన్మార్‌లో అధిక సంఖ్యలో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన మాయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆదేశానికి 15 టన్నుల రిలీఫ్‌ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యవసర సరుకులు కూడా ఉండనన్నాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి IAFC ఎయిర్ క్రాఫ్ట్ లో వీటిని […]

10.20 సెకన్లలో 100 మీటర్లు. . . జాతీయ రికార్డు

ఇండియన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి టోర్నీలో పంజాబ్‌ యువ అథ్లెట్‌ గురిందర్‌వీర్‌సింగ్‌ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం ఉత్కంఠగా సాగిన పురుషుల 100మీటర్ల రేసును గురిందర్‌వీర్‌సింగ్‌ 10.20 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకంతో మెరిశాడు. మణికంఠ హోబ్లిధార్‌ నిరుడు నెలకొల్పిన 10.23 సెకన్ల రికార్డును తాజాగా ఈ పంజాబ్‌ యువ అథ్లెట్‌ తిరుగరాశాడు.

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ విజయ్‌ పార్టీ తీర్మానం

జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజక వర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీటిని వ్యతిరేకిస్తూ తమిళ సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ (టీవీకే) శనివారం తీర్మానాలను ఆమోదించింది. శుక్రవారం తిరువన్మయూర్‌లో తొలి జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిండంతోపాటు మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది.

అన్ని రాష్ట్రాల్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తాము… అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రోజున టైమ్స్ నౌ సమ్మిట్ 2025 ముగింపు సమావేశానికి హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని తాము ఇంతకు ముందే చెప్పామని అన్నారు. అలాగే ఈ పార్లమెంట్ సమావేశంలో తాము వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడతామని కూడా తెలిపారు. ఇది భారత పార్లమెంటు. పార్టీ కార్యాలయం కాదు, పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ తన పార్టీలో తనకు లభించే ప్రత్యేక హక్కులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON