loader

మహిళల వన్డే వరల్డ్ కప్.. భారత్‌ ఆతిథ్యం

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్‌కు భారత్ నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది.ఆతిథ్య దేశం భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.

బెట్టింగ్ యాప్ డౌన్ లోడర్లకు షాక్-మొబైల్ ఫోన్ల బ్లాక్ ?

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్ధితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయిస్తోంది. ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్ వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా చేయబోతోంది.

తెలుగు భాషకు అన్యాయం!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్‌ మీడియంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు అధికార భాషగా ఉన్న రాష్ట్రంలోనే తెలుగు భాషకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించినవారు నలభై ఏండ్లలోపు వారే ఉన్నారని ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలలో నిజమెంత అనే అంశాలను టీజీపీఎస్‌సీ తేటతెల్లం […]

న్యాయ వ్యవస్థకు అగ్నిపరీక్ష

ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్నది. కొందరు న్యాయమూర్తు ల ప్రవర్తన, తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి. దేశ చరిత్రలోనే సంచలనాత్మకమైనదిగా మిగిలిపోయే ఈ కేసులో ఎలా వ్యవహరిస్తుంది? ఇటీవలే కళ్లకు గంతలు తొలగిపోయిన న్యాయదేవత ఈ ‘అగ్నిపరీక్ష’లోంచి ఎలా బయటపడుతుంది?అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం…ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేద ముస్లింలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం అని చెప్పుకొచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

సీఏ విద్యార్థులకు అలర్ట్: ఇక, ఫైనల్ పరీక్షలు కూడా ఏడాదికి మూడు సార్లు!

చార్టెర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలకు సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కీలక ప్రకటన వెలువరించింది. గత ఏడాది మార్చిలో సీఏ ఇంటర్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఐసీఏఐ.. 2025 నుంచి సీఏ ఫైనల్ పరీక్షల్ని కూడా ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సీఏ ఫైనల్ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON