loader

ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరూ తొలగింపు

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ సంస్థ విషయంలో ఇటీవల పెద్ద వివాదం నడిచింది. ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి పదవితో పాటుగా తెలుగు దేశం పార్టీకి కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే తాజాగా ఫైబర్ నెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా విధుల్లో కొనసాగుతున్న సిబ్బందిని తప్పిస్తున్నారు. 417 మందిని తొలగించారు.. జీతాలు కూడా నిలిపేశారు. తాజాగా మరో […]

జైల్లో ఉన్న ఎంపీకి హైకోర్టు అవకాశం.. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చట

ఇంజినీర్ రషీద్‌గా ప్రసిద్ధి చెందిన అబ్ధుల్ రషీద్ షేక్ బారామూల్లా లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఒమర్ అబ్దుల్లాను ఓడించి విజయం సాధించారు. .. 2017లో ఉగ్రవాదానికి నిధులు సుమకూర్చారనే ఆరోపణలతో ఎన్ఐఏ ఎంపీ రషీద్‌ను అరెస్ట్ చేసింది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రషీద్ కస్టడీలో పార్లమెంట్‌కు హాజరు కావాలని.. పోలీసులే తమ ఎస్కార్ట్‌లో తీసుకెళ్లాలని వివరించింది. అలాగే పార్లమెంట్ వద్ద ఎంపీ ఎవరితోనూ […]

ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్ చనిపోయి కనిపించడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని అనుకున్నప్పటికీ పాస్టర్లు మాత్రం ఇది హత్యగా అనుమానిస్తున్నారు. కొవ్వూరు టోల్‌ గేట్‌ సమీపంలో ప్రవీణ్‌ టూవీలర్‌పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభించింది. టోల్‌ గేట్‌ నుంచి 11.31 నిమిషాలకు బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగిన 11. 43 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు కేసులో కీలకం. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో కూడిన […]

పాడేరు మన్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీ

గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ ఉండాలనే ఆలోచనతో పాడేరు మన్యంలోనూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు అల్లూరి జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. మన్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో ఉన్న ఉన్నత విద్యామండలి సెక్రటరీ కోన శశిధర్‌ను సీఎం ఆదేశించారు.

విజయవాడలో ఇఫ్తార్‌ విందుకు హాజరైన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ ‌

పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందును విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో ఇచ్చే ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ హాజరయ్యారు. ముస్లింలకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్ధూలో రంజాన్‌ ముందస్తు శుభాకాంక్షలు చెప్పిన వైఎస్‌ జగన్ అందరి ప్రార్ధనలు సఫలం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ప్రత్యేక ప్రార్థనల తర్వాత ముస్లింలతో కలిసి ఇఫ్తార్‌ విందు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON