loader

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శతక్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్‌ రివీల్ చేయనున్నారట మేకర్స్.

తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త

తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుతిస్తున్నారు. నేడు మొదటిరోజు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అనుమతించగా.. భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ తొలిరోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారుు. తెలంగాణ భక్తులకు సిఫార్సు లేఖల ద్వారా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు కు భక్తులు […]

జపాన్‌లో ‘ఎన్టీఆర్’ తుఫాన్: ఇండియన్ స్టైల్లో ఫ్యాన్స్ రచ్చ!

జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR యొక్క భారీ విజయం తర్వాత జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది . దేవర రిలీజ్ కోసం అక్కడ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో వీరాభిమానులు ఎలా ఎన్టీఆర్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్తోంది. ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు చేస్తున్న అమ్మాయిలు వీడియోలో ఉన్నారు. ఎన్టీఆర్‌ అక్కడ జరిగే ప్రత్యేక ప్రదర్శనలకు హాజరయ్యేందుకు, అభిమానులతో ముచ్చటించేందుకు […]

సైకిల్‌పై వెళ్లి.. సమస్యలు తెలుసుకొని

మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి మెదక్‌ జిల్లాకేంద్రం నుంచి సైకిల్‌పై బయలుదేరి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట పట్టణానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికుల సమస్యలు అడి గి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో  మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహాలక్ష్మి పథకం అమలు గురించి ఆరాతీశారు. అనంతరం తన సతీమణితో కలిసి బస్సు లో టికెట్‌ తీసుకొని మెదక్‌కు ప్రయాణించారు. ఇటీవల కలెక్టర్‌ దంపతులు పొలాలను సందర్శించి వరినాట్లు వేశారు.

న్యాక్‌ ఇంజినీర్లపై వేటు

జీహెచ్‌ఎంసీలో 27 మంది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌(న్యాక్‌) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్‌ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దింపి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీశారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 100 మంది న్యాక్‌ ఇంజినీర్లు ఉండగా, ప్రధానంగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ […]

భారత తొలి బ్యాటర్‌గా ఇషాన్ రికార్డు

యంగ్ డైనమైట్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నయా రికార్డును నమోదు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఇషాన్ కిషన్.. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీపూర్తిచేసుకున్న అతను.. మరో 20 బంతుల్లోనేసెంచరీమార్క్ అందుకున్నాడు. సన్ రైజర్స్ తరఫున ఇప్పటివరకు విదేశీ ఆటగాళ్లు మాత్రమే శతకాలు సాధించారు.

డీలిమిటేషన్‌పై శాసనసభలో తీర్మానం?

నియోజకవర్గాల పునర్విభజన విధానంపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ఆందోళన చేస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం సోమవారం డీ లిమిటేషన్‌పై తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ ఇటీవల చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఇరు పార్టీల నేతలు హాజరై తమ గళం వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డీ లిమిటేషన్ పై ప్రవేశపెట్టనున్న తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించనున్నట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON