loader

హిందీపై కర్ణాటకలోనూ అంటుకున్న చిచ్చు!

కర్ణాటకలోని ఒక హోటల్ ముందు హిందీని అధికారిక భాషగా ప్రదర్శించిన డిజిటల్ బోర్డు తీవ్ర వివాదానికి దారితీసింది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కర్ణాటకలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన హోటల్‌ ముందు ఓ పెద్ద డిజిటల్‌ బోర్డుపై హిందీ అధికారిక భాష అని డిస్‌ప్లే చేశాడు. దీంతో ఆ బోర్డును ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ హోటల్‌ యజమానిపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. భవన యజమానిని పిలిపించి […]

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో సంచలనలకు కేంద్ర బిందువుగా మారారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఆయన ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై  సంతకం చేశారు. ఈ ఉత్తర్వులతో ఫెడరల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్ శాశ్వతంగా తొలగించడం మొదలైందని ట్రంప్ అన్నారు. ‘‘మేము వీలైనంత త్వరగా మూసివేస్తాం.. దీని వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.. విద్యను రాష్ట్రాలకు […]

వచ్చే నెల రోజుల్లో గ్రూప్‌ 2, 3 నియామకాలు పూర్తి చేస్తాం.. సీఎం రేవంత్‌

తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్‌ మరో శుభవార్త చెప్పారు. వచ్చే నెల రోజుల్లోనే గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేసి, నియామక పత్రాలు అందజేస్తామని హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ ఆయన ‘బిల్డ్‌ నౌ పోర్టల్‌’ను ప్రారంభించారు.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి సీఎం రేవంత్‌ నియామక పత్రాలు అందజేశారు.

మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్

లండన్‌ పర్యటనకు వస్తున్న చిరంజీవిని కలిసేందుకు.. అభిమానులతో చిరంజీవి సమావేశమవుతారని.. ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేశారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి పనిని నేను అంగీకరించను. దీనిని ఖండిస్తున్నా’ అని చిరంజీవి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘అభిమానుల సమావేశం పేరిట డబ్బులు వసూళ్లు చేసిన వారు వెంటనే తిరిగి ఇచ్చేయండి’ అని మెగాస్టార్‌ ఆదేశించారు.

హనీ ట్రాప్‌లో 48 మంది నేతలు!

కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. గడచిన ఆరు నెలలుగా రాష్ట్రంలోని రాజకీయ నాయకులపై హనీ ట్రాప్‌ జరుగుతోందని ఆయన తెలిపారు. తుమకూరుకు చెందిన ఇద్దరు మంత్రులు హనీ ట్రాప్‌లో […]

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు..రియాక్షన్

ప్రకాష్ రాజ్ : బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ను తొమ్మిదేళ్ల క్రితం చేశానని, తప్పు తెలుసుకుని తర్వాత యాడ్‌ను ఆపివేయాలని సంస్థను కోరానని తెలిపారు. విజయ్ దేవరకొండ టీం : చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవర కొండ ప్రచారం నిర్వహించాడని ఆయన టీం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గుబాటి రానా టీం : రానా దగ్గుబాటి స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌కు మాత్రమే ప్రమోట్ చేశారని ఆయన టీం ఓ ప్రకటనలో […]

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..30 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. ఒకేరోజు బీజాపుర్, కాంకెర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్ల లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో బీజాపూర్ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు.

టాలీవుడ్‌కు బెట్టింగ్ షాక్

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు  దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీతా, నిధి అగర్వాల్, అనన్యా నాగళ్ల,  టీవీ నటులు, యాంకర్స్  యూట్యూబర్స్,  అయిన  సిరి హన్మం తు, శ్రీముఖి, వర్షీణి సౌందరాజన్, వాసంతి కృష్ణన్, శోభ శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహ పటాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామలా, తస్యతేజ్, రీతు చౌదరి,  సుప్రితపై […]

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు.. ముగిసిన విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ

్రస్తుతం బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసు ఏపీ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు జారీ చేసిన నోటీసులు మేరకు.. విష్ణుప్రియ, రీతూ చౌదరి గురువారం విచారణకు హాజరయ్యారు. గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ప్రస్తుతం అవి వైరల్‌ అయ్యాయని రీతూ చౌదరి పేర్కొంది. అలాగే, విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ని సైతం పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్‌ కిరణ్‌ని సైతం పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే మిగతా వారికి నోటీసులు జారీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON