loader

చిరంజీవిపై పవన్ కళ్యాణ్ క్రేజీ కామెంట్స్..

చిరంజీవికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. దీంతో చిరుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడంపై పవన్‌ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని తెలిపారు.

20 మంది ఎమ్మెల్యేలకు షాకివ్వబోతున్న చంద్రబాబు..

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శృతి మించిన 20 మంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని సమాచారం అందుతోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా వాళ్ల తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు సైతం ఆ నేతలు చెప్పినట్టు వినవద్దని చెప్పినట్టు సమాచారం.

సునీతా విలియమ్స్ పై RR ఇంట్రెస్టింగ్ పోస్ట్!

ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ తిరిగి రావడాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. అంతరిక్షంలో 286 రోజులు గడిపిన ఆమె, స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌లో భాగంగా తిరిగి భూమికి చేరుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) సరికొత్త కోణంలో జరుపుకుంది. “ఐపీఎల్ 2025కి సరైన సమయానికి తిరిగొచ్చింది!” అనే హాస్యస్ఫూర్తితో కూడిన పోస్ట్‌ను RR సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గ్రోక్ బూతులపై కేంద్రం ఆరా.. ఎక్స్‌తో టచ్‌లోకి ఐటీ శాఖ..!

నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ గ్రోక్ చాట్ బాట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తెలుగు, హిందీ లాంటి భాషల్లో యాసలను, బూతులను అలవోకగా వాడేస్తోంది. ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి రావడంతో.. కేంద్ర ఐటీ శాఖ రంగంలోకి దిగింది. గ్రోక్ చాట్ బాట్ అసభ్యకరమైన భాషలో సమాధానాలు ఇస్తుండటం పట్ల కేంద్రం సీరియస్‌‌గా ఉందని సమాచారం. ఈ విషయమై ‘ఎక్స్’తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది.

ఏపీ ప్రభుత్వ సలహాదారులు వీళ్లే . . .

ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అదే సమయంలో- ఆయా రంగాలకు సంబంధించి ప్రభుత్వంలో నలుగురు సలహాదారులు నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా కేపీసీ గాంధీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్- జీ సతీష్ రెడ్డి, స్పేస్ టెక్నాలజీ- ఎస్ సోమనాథ్, చేనేత, హస్త కళల అభివృద్ధి శాఖ సలహాదారుగా సుచిత్ర ఎల్లా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు […]

రేషన్ కార్డు పాపులార్టీ కార్డుగా మారింది సుప్రీంకోర్టు ఆందోళన

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని పేర్కొంది. “పేద ప్రజల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు అర్హులు కాని వారికి నిజంగా చేరుతున్నాయా లేదా అనేది మా ఆందోళన” అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కొన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధిని చూపించాలనుకున్నప్పుడు మన తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నాయి. బిపిఎల్ గురించి మాట్లాడేటప్పుడు, జనాభాలో 75 శాతం మంది బిపిఎల్ అని అంటున్నారు.  ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు […]

ఆక్వా మెరైన్ పార్కుపై రేణూదేశాయ్ హైకోర్టులో పిల్

తెలంగాణ ప్రభుత్వం  దేశంలోనే అతిపెద్ద ఆక్వా మెరైన్ పార్కును రూ.300 కోట్ల భారీ నిధులతో నిర్మిస్తున్నారు. అయితే సముద్రం లేకుండా ఆక్వా మెరైన్ పార్కును నిర్మించడం సాధ్యం కాదంటూ తక్షణమే దానిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని రేణూ దేశాయ్, శ్రీవిద్య కోర్టులో పిల్ దాఖలు చేశారు. సముద్రంలేని చోట అరుదైన జాతులు కృత్రిమ నీటిలో జీవించలేవని పేర్కొన్నారు ఆక్వా మెరైన్ పార్కు ఏర్పాటుకు ముందు సముద్ర జీవులు, వాటి సహజ అలవాట్లపై కనీసం అధ్యయనం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON