loader

13 చోట్ల ప్రారంభ వేడుకలు: ఐపీఎల్ కొత్త చరిత్ర!

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రికెట్ లీగ్ లు మొదలైనా దాని దరిదాపుల్లోకి రావడం లేదు. అలాంటి ఐపీఎల్ ఈ ఎడిషన్ లో మరో కొత్త సంప్రదాయానికి తెర తీయనుంది. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది ఐపీఎల్ 2025 సిరీస్‌లో 13 వేదికల్లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ […]

రష్యా.. ఉక్రెయిన్ యుద్ధానికి తాత్కాలిక ముగింపు!

ఉక్రెయిన్‌లో శాంతి చర్చలకు అమెరికా, రష్యా సుముఖత వ్యక్తం చేశాయి. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఫోన్‌లో చర్చించుకున్నారు. రెండు దేశాలూ 175 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేసుకోనున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 30 రోజులపాటు యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించగా, పుతిన్ కూడా కొన్ని షరతులతో సమ్మతించారు.

286 రోజుల తర్వాత భూమి మీదకు సురక్షితంగా సునీత..

సునీత విలియమ్స్ భూమి మీదకు ఎట్టకేలకు అడుగు పెట్టారు. క్యాప్సూల్ నుంచి స్ట్రక్చర్ పై బయటికి వచ్చాక అందరికీ చెయ్యి ఊపుతూ నవ్వుతూ ఆమె ముఖం కనిపించింది. ఆమెను వెంటనే వైద్య సేవలపై ఆసుపత్రికి తరలించారు 46 రోజులు పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. సునీతతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు వాళ్లని తీసుకురావడానికి వెళ్లిన మరికొందరు ఆస్ట్రోనాట్స్ ‘క్రూ డ్రాగన్ హ్యూమన్’ తెల్లవారుజామున 3:27 కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర […]

సచివాలయాల ప్రక్షాళన

సచివాలయాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి.. గ్రేడ్‌-4 పంచాయతీల్లో 72 మందిని నియమించింది. ఇక సచివాలయల్లో ఉన్న 11 మంది ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజించి. రెండేసి సచివాలయాలను ఒక్క క్లస్టర్‌గా పరిగణించి.. సిబ్బందిని సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు జనాభా అధారంగా సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించేందుకు పంచాయితీరాజ్‌ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !

ఐపీఎల్ 2025 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘రాజత్ పటిదార్ ఆర్సీబీకి లాంగ్ టర్మ్ లీడర్’ అని అన్నాడు. ఆర్సీబీని నడిపించడానికి రజత్‌కు పెద్ద బాధ్యత ఉందనీ, ఛాంపియన్‌గా ఉండటానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. రాజత్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి లెజెండ్స్ ఆర్సీబీకి ఆడారని అన్నాడు. ఇప్పుడు అదే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గొప్ప […]

ఆధార్-ఓటరు కార్డ్ అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన

ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఒక్కరికే రెండు చోట్ల ఓటర్ ఐడీ కార్డులు ఉండటం కూడా గందరగోళానికి తావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోపడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం యూనిక్ ఐడెటిఫికేషన్ అధారిట ఆఫ్ ఇండియా (UIDAI), ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఈసీ […]

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 పౌర సేవలు… మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో వాట్సప్‌ గవర్నెన్స్‌‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘మన మిత్ర’ ద్వారా ప్రస్తుతం 200 సేవలు అందిస్తుండగా… ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆ సంఖ్యను 500కు పెంచుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వంద రోజుల్లో ఏఐ- ఆధారిత వాయిస్ సేవలను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. మరో 100 రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)-ఎనేబుల్ సేవలు, క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టబడుతుందని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON