loader

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం…

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. 2026 గణతంత్ర వేడుకల వేళ ప్రకటించే పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. పద్మ అవార్డులకు నామినేషన్లకు చివరి తేదీ జూలై 31. పద్మ అవార్డులకు నామినేషన్లు/సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in)లో ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.  వైద్యులు, శాస్త్రవేత్తలను మినహాయించి… పీఎస్‌యూలలో పనిచేసే వారు ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు కేంద్రం అనుమతుల నిరాకరణ

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి తరలింపుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏవైనా అక్రమ నిర్మాణాలు జరిగినా, అవకతవకలు జరిగిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాని కి కృష్ణా నది నీటిని తరలించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది.

ఏపీలో టెన్త్ విద్యార్థులకు .. ఫ్రీ బస్సు సౌకర్యం..

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (మార్చి 17న) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీవ్యాప్తంగా మొత్తం 649884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా.. వీరి కోసం 3450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికి ముందే కేంద్రానికి విద్యార్థులు చేరుకునేలా బస్సుల సర్వీసులను నడుపనున్నట్టు కూడా తెలిపారు.

నేను యూటర్న్ తీసుకోలేదు!: పవన్ కళ్యాణ్

త్రిభాష విధానంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో ఈ రెండు అంశాలు దోహదపడవంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ISIS పై అమెరికా ఉక్కుపాదం.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ ఖతం..

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు అబూ ఖదీజాను చంపాయని ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ తెలిపారు. అతన్ని “ఇరాక్, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరు” అని అభివర్ణించారు. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్ లో జరిపిన ఆపరేషన్ లో అతన్ని హతమార్చింది. అబు ఖదీజా, మరోటెర్రరిస్టు వాహనంప వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో వైట్ హౌస్ విడుదల చేసింది

పవన్ పుట్టక ముందు నుంచే వ్యతిరేకిస్తున్నాం : డీఎంకే ఎటాక్

తమిళనాడులో చెలరేగిన హిందీ భాషా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దీనిపై తీవ్రంగా స్పందించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర గురించి పవన్ కల్యాణ్‌ అజ్ఞానం బయటపడిందని ఆరోపించింది. “మేము 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాము. నటుల కాదు, విద్యానిపుణుల సలహాలు, సూచనలతో తమిళనాడు ఎల్లప్పుడూ ద్వి భాషా సూత్రాన్ని అనుసరిస్తుందని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON