loader

ఐపిఎల్ సీజన్ 2025కి సర్వం సిద్ధం

అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025కి మార్చి 22న తెరలేవనుంది. మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీకి తెరపడుతుంది. ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతోంది.

IPL 2025: రూ. 2 కోట్ల ప్లేయర్‌పై 2 ఏళ్ల నిషేధం..

ఇంగ్లాండ్ దూకుడు బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి వచ్చే రెండేళ్ల పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిషేధించింది. బోర్డు కొత్త విధానం ప్రకారం, బ్రూక్ రాబోయే రెండేళ్ల పాటు వేలంలో పాల్గొనలేరు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసింది. నిజానికి, బ్రూక్ ఇటీవల ఈ సీజన్ నుంచి చివరి క్షణంలో తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ తప్పుకు భారత బోర్డు అతన్ని శిక్షించింది.

పవన్ కళ్యాణ్‌గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్.. ప్రకాష్ రాజ్

దేశవ్యాప్తంగా తమిళనాడు ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది.. నటుడు ప్రకాష్‌ రాజ్‌. చిత్రాడ సభలో హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

గ్రీన్‌కార్డుతో శాశ్వత నివాసం రాదు

గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా లో నిరంతరం ఉండలేరని, ఆ హక్కు గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఉండబోదని, అమెరికా ప్రభుత్వం తలచుకుంటే వారిని వారి దేశాలకు డిపోర్ట్ చేయొచ్చ ని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి.వాన్స్ అన్నారు. అమెరికాలో అత్యధిక గ్రీన్ కా ర్డులు కలిగిన వారిలో రెండో స్థానం భారతీయుల దే. ‘అమెరికా అధ్యక్షుడు లేక విదేశాంగ కార్యదర్శి ఏ ప్రవాసి అయినా తమ దేశంలో ఉండకూడదనుకుంటే అలాంటి వారికి చట్టబద్ధంగా నివసించే హక్కు ఉండదు’ అని వాన్స్ […]

సునీతా విలియమ్స్ త్వరలో భూమికి.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమిపై కాలు మోపనున్నారు.అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. ఫాల్కన్ 9 రాకెట్ మార్చి 14, 2025న శనివారం ఉదయం 4:33 గంటలకు  అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ వ్యోమనౌక, […]

స్వర్ణ దేవాలయంలో ఇనుప రాడ్‌తో దాడి ఐదుగురికి గాయాలు

పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, ఆ వ్యక్తికి ఐసీయూలో చికిత్స జరుగుతోందని వైద్యులు చెప్పారు. నిందితుడికి మరొకరు సహకరించారని.. దాడికి ముందు వారిద్దరూ ఆలయంలో రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని హర్యానాకు చెందిన జుల్ఫాన్‌గా గుర్తించారు

మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చే శక్తి యాప్‌

మహిళలు ఆటోలో ప్రయాణించే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే.. శక్తి యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే..ఆ సమాచారాన్ని తల్లిదండ్రులతోపాటు పోలీసులకు పంపించవచ్చు. వేధింపులు, ర్యాగింగ్‌లు   మహిళల చిత్రాలను మార్ఫింగ్‌ చేసి.. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. బాధితులను బెదిరించి సొమ్ము చేసుకునే నేరాలు పెరిగిపోయాయి. వీటిపైనా నేరుగా ఈ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ పాఠశాల, కళాశాలలో పోలీసులు ‘సంకల్పం’ పేరిట ‘డ్రాప్‌బాక్స్‌’లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా బాధిత మహిళలు […]

21 రోజులైనా లభించని ఏడుగురి ఆచూకీ

ఎస్‌ఎల్‌బీసీలో సొరంగంలో ఏడుగురు కార్మికులు గల్లంతై 21 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్‌ హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబోతోపాటు ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌,

తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి…భాష వద్దు కానీ డబ్బు కావాలా?: పవన్ కల్యాణ్

కేంద్రం, తమిళనాడు మధ్య హిందీ భాషా లడాయిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. భాషలను ద్వేషించే విధానం పోవాలని ఆకాంక్షించారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు… అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు, హిందీ వద్దు అంటుంటే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి…కానీ మేం హిందీని ద్వేషిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON